YSRCP Telangana
-
లోకేష్ యువ గళం కాదు.. టీడీపీకి సర్వ మంగళం: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: లోకేష్ యువ గళం కాదు.. టీడీపీకి సర్వ మంగళం అంటూ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్రపై స్పందించారు. పాదయాత్ర మొదటిరోజే లోకేష్‌కు రియాలిటీ తెలుస్తుందన్నారు. ‘టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ తాపత్రయం. జనసేన పార్టీ.. కన్ఫూజన్ పార్టీ’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.‘‘కావాలనే పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు చాలా హైప్ ఇస్తున్నాయి. దశ దిశ లేకుండ ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్లు పాదయాత్రలో ఏం చెప్తారు. ప్రజా సమస్యలపై సీఎం జగన్ పోరాటం చేసి పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చి 99 శాతం హామీలు అమలు చేశారు’’ అని మంత్రి అన్నారు. ఏఎన్ఆర్పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని, ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచించాలి’’ అని మంత్రి రోజా అన్నారు. చదవండి: ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు: మంత్రి సురేష్ -
సస్యశ్యామలం.. సిరుల పంటలకు సంగం బ్యారేజీ సిద్ధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సంగం బ్యారేజీ చివరి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి.. ఈ సీజన్లోనే ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. జలయజ్ఞంలో భాగంగా కొత్త బ్యారేజీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. బ్యారేజీ పనులు చేయడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతుల కలల బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బీడు భూముల్లో సిరుల పంటలు పండనున్నాయి. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు యోగ్యకరం కానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంకరార్పణ చేస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణ పనులు పూర్తిచేశారు. శిథిలావస్థలో ఉన్న 135 ఏళ్ల నాటి ఆనకట్ట కమ్ బ్యారేజీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. బ్రీటీష్ కాలంలో సింహపురి ప్రాంత అన్నదాతల కోసం నిర్మించిన సంగం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకుంది. సాగునీటి కోసం అన్నదాతలు, తాగునీటి కోసం నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంగం బ్యారేజీ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. సంగం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిపక్షనేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంగం పర్యటించారు. అన్నదాతల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంగం వద్ద పెన్నానదిలో నూతన బ్యారేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.122.50 కోట్ల వ్యయంతో 2006లో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ అకాల మరణంతో బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయి. బ్యారేజ్‌పై రాకపోకల కోసం ఏర్పాట్లు నిర్మాణం పూర్తి సంగం నూతన బ్యారేజ్ నిర్మాణ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది. 1,195 మీటర్ల పొడవుతో పెన్నానదిలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్యారేజ్‌కి 85 గేట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణకు మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బ్యారేజ్ నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే నిర్మాణాలు పూర్తయ్యాయి. సంగం పాత ఆనకట్ట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిధుల వృథాకు చెక్ పాత ఆనకట్ట వల్ల కనుపూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువకు నీరు అందించేందుకు ప్రతి సంవత్సరం రూ.50 లక్షలకు పైగా నిధులతో ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి నీరు అందించేవారు. నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల ఇసుక బస్తాలతో పనిలేకపోవడంతో ప్రతి సంవత్సరం రూ.50లక్షలకు పైగా ప్రజాధనం వృథా కాకుండా నిలిచిపోతుంది. పైగా సంగం బ్యారేజ్ వద్ద 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. మరోవైపు భూగర్భజలాలు పెరిగి నీరు మోటార్లకు సైతం అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమస్యకు బ్రేక్ నిత్యం సంగం పాత బ్యారేజ్ పైన రాకపోకలు స్తంభించేవి. ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు ఉండేది. త్వరలో ఈ సమస్య తీరిపోనుంది. నూతన బ్యారేజ్ మీద రాకపోకల కోసం 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు. రెండు వైపులా వాహనాలు తిరిగే వీలు ఏర్పడింది. పాదచారులు నడిచేందుకు వీలుగా 1.5 మీటర్ల నడక దారిని సైతం నిర్మించారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సౌకర్యం మెరుగుపడుతుంది. ఆనందంలో అన్నదాతలు కలలు కార్యరూపం దాల్చడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి, పనులు పూర్తిచేసిన ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతన బ్యారేజ్‌కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం జగన్మోహన్రెడ్డి మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని అన్నదాతలు, ప్రజలు హర్షాతిరేకాల మధ్య చెబుతున్నారు. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్సార్ సంగం బ్యారేజ్ స్థానంలో నూతన బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడు. అన్నదాతల కష్టాలు తెలిసిన నేత నూతన బ్యారేజ్‌తో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సాగునీరు పొందిన ప్రతి రైతు ఆ మహానుభావుడి పేరును చిరకాలం గుర్తుంచుకుంటారు. – పులగం శంకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తండ్రికి మించిన తనయుడు తండ్రి శంకుస్థాపన చేసిన సంగం నూతన బ్యారేజ్‌ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడు. అన్నదాతల కష్టాలు తీర్చిన తండ్రి, తనయులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. – కంటాబత్తిన రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం సంగం నూతన బ్యారేజ్‌కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం. దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎంతటి మర్యాదనిస్తారో తెలియచెప్పారు. అంతేకాకుండా తన దగ్గరి వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటారనే విషయం మరోమారు రుజువైంది. – ముడి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు -
ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ కేసు నిందితులకు సరైన శిక్ష పడిందని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని, సత్వర న్యాయం చేశారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఇటువంటి శిక్షలే సరి అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందని భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దారుణాలకు పాల్పడే వారికి వెంటనే శిక్షలు పడేలా చట్టాలను మరింత కఠినంగా మార్చాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. (చదవండి: ఎన్కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత) -
వైఎస్సార్సీపీకి పూర్వవైభవం వస్తుంది..
సాక్షి, ఖమ్మం: ఉభయ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని, పార్టీ అభివృద్ధికి, ఎదుగుదలకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు లక్కినేని సుధీర్‌బాబు, కొల్లు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్లో విజయోత్సవ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో తొలుత దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్.జగన్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా పార్టీ బాధ్యులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా.. కొల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ నాయకులను గెలిపిస్తే గెలిచాక పార్టీని వీడారని, కానీ ఓట్లు వేసిన కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారని, వారి తెగువ గొప్పదని అన్నారు. జిల్లాలో ఇతర పార్టీల నాయకుల బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని, ఎదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని అన్నారు. పార్టీ అంటే వైఎస్సార్ కుటుంబం అని, ప్రతి కార్యకర్తా కుటుంబంలోని సభ్యులేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనస్పర్థలు లేకుండా పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర నాయకత్వంతో చర్చించి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు జిల్లా నుంచి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశా.. వైఎస్సార్ సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు మాట్లాడుతూ తాను పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసమే పని చేశానని అన్నారు. మహానేత వైఎస్సార్ అభిమానిగా, జననేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సీనియర్లుగా ఉండి తనకంటే ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అగ్రనాయకత్వం సూచనలు పాటిస్తూ వస్తున్నట్లు తెలిపారు. నీతి, నిజాయతీ, విశ్వసనీయత, కష్టడపే తత్వమే పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఈ రోజు ఈ స్థాయికి చేర్చాయని, ఆయన అడుగుజాడల్లో ఊపిరున్నంతకాలం పనిచేస్తానని తెలిపారు. తెలంగాణాలో గతంలో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం పట్ల నాయకులు, కార్యకర్తలు కొంత నైరాశ్యంలో ఉన్నారని, అధినేత జగనన్న, పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు ఇక్కడ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఎంతమంది పార్టీలు మారినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, క్యాడర్ మాత్రం పార్టీలు మారలేదని, అధికారం, పదవులు లేకపోయినా వైఎస్సార్ కుటుంబాన్ని, పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారడం లేదని ఇతర పార్టీలు విధ్వంసాలకు దిగాయని, స్వయాన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడి ఆస్తులను కొందరు ధ్వంసం చేశారని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేమిరెడ్డి రోశిరెడ్డి, నాగిరెడ్డి, జల్లేపల్లి సైదులు, ఖమ్మం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప్లానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాంబాబు రెడ్డి, ఆలస్యం రవి, గాదె వీరారెడ్డి, షేక్ మస్తాన్‌సాబ్, బాలశౌరి, నాగవరపు రాములు, జిల్లా మహిళా కార్యదర్శులు గోళ్లమూడి శ్రీలక్ష్మి, గుడవర్తి స్వరూపరాణి, యాకాలక్ష్మి, తోటకూర ప్రభావతి, ఆయా మండలాల అధ్యక్షులు మల్లారెడ్డి, వీరారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, వైవీడీ.రెడ్డి, తాళ్లూరి రాంబాబు, హన్మంతరావు, అశోక, పసుపులేటి సైదులు, నర్సింహారావు, నాగిరెడ్డి, యువజన నాయకులు మురళి, జిల్లా యుజవన సంఘం బాధ్యులు నిఖిల్‌రెడ్డి బొబ్బ, మందపాటి దయాకర్‌రెడ్డి, నాయకులు గండ్రా నాగేందర్‌రెడ్డి, బండి నాగరాజు, వెంకటకిరణ్రెడ్డి, గోపీచంద్, ఎస్టీసెల్ నగర కార్యదర్శి వీరునాయక్, గొట్టిపర్తి గోపి, రావూరి పిచ్చయ్య, లఘుపతినాయక్, మాళోతు ప్రసాద్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జగన్ అన్నతో కొత్త ఆశలు..: మందడపు వెంకటరామిరెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడంతో ఇక్కడ మనవద్దా ఆశలు పెరిగాయని తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలా ధైర్యం వచ్చిందని, భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. -
మహిళాబిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు
-
వ్యూహాలకు పదును..సమరానికి అదును
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘ముందస్తు’ షెడ్యూలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరో 60 రోజుల్లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుండగా.. ఈలోగా ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మినహా అన్ని స్థానాలకూ టీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను టీ పీసీసీ, ఏఐసీసీలకు డీసీసీ ద్వారా పంపించగా.. ఫ్లాష్ సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు జరుగుతోంది. బీజేపీ కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. మిగతా స్థానాల్లో ఈనెల 10న అమిత్ షా పర్యటన అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కూటమి చర్చలు నేడో, రేపో కొలిక్కి రానుండగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పోటీచేసే స్థానాలు తేలంనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఐదారు స్థానాలపై వైఎస్సార్ సీపీ గురి పెట్టింది. సీపీఎం అలయెన్స్‌తో ఉన్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఇప్పటికే కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తోంది. బీఎస్పీ, ఇతర పార్టీలు కూడా పోటీపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈరెండు నెలల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గులాబీ శ్రేణుల ప్రచార హోరు.. అసంతృప్తులది అదే తీరు.. సెప్టెంబర్ 6న శాసనసభ రద్దుతోపాటే రాష్ట్రంలో 105 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటింంచిన విషయం తెలిసిందే. చొప్పదండి నియోజకవర్గం మినహా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 స్థానాలలో ‘సిట్టింగ్’లకే అవకాశం కల్పించారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి బాగానే ఉన్నా.. వేములవాడ, రామగుండం, మానకొండూరులో టికెట్ల కేటాయింపుపై నిరసనలు, ఆందోళనలు జరిగాయి. పెద్దపల్లి, మంథని, జగిత్యాలలోనూ అసంతృప్తులు నిరసన గళమెత్తారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో మానకొండూరులో వివాదానికి శనివారం తెరపడింది. రామగుండం, వేములవాడలో పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతోంది. పెద్దపల్లి, మంథనిలో చాపకిందనీరులా అసమ్మతి రగులుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారంతో ఇప్పటికే రెండు విడతలుగా చుట్టేసిన మంత్రి ఈటల రాజేందర్.. ఆదివారం హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్లలో ప్రచారం హోరెత్తుతోంది. మంథ ని, పెద్లపల్లి, రామగుండంలో అభ్యర్థులు ప్రచా ర ం చేస్తున్నారు. రామగుండం, వేములవాడ, జగిత్యాలలో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసంతృప్తులు కూడా ప్రచారం చేస్తుండటం తలనొప్పిలా మారింది. చొప్పదండిలో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోగా.. తాజామాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. టికెట్ రేసులో ముందున్న సుంకె రవిశంకర్ ఎవరికివారుగా టీఆర్ఎస్ నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు నెలరోజులుగా గ్రామగ్రామానా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ నాలుగేళ్ల మూడునెలల కాలంలో నియోజకవర్గానికి ఏం చేశామనే విషయాన్ని వివరిస్తూ ముందుకెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసేలా కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసంతృప్తులున్న చోట బుజ్జగింపుల పర్వం కూడా సాగుతోంది. కాంగ్రెస్ టికెట్లకు సర్వే నివేదికలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధిష్టానం.. తాజాగా శనివారం ప్రాథమిక పరిశీలన ప్రక్రియను ముగించి టీపీసీసీకి పంపింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న కాంగ్రెస్ ఫ్లాష్ సర్వే తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోం ది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇప్పటికే నియోజకవర్గానికి మూడు నుంచి పదిమంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కోస్థానం నుంచి మూడునుంచి ఐదుగురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఉన్న ఆశావహులకు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఆదరణ, గుర్తింపు ఉందనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈనెల 13లోగా ఫ్లాష్ సర్వే నిర్వహించనున్నారు. జగిత్యాల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్ మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగనుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొమ్మిదిస్థానాలకు ఈనెల 13 తర్వాత ప్రకటించే జాబితాలో అభ్యర్థులు ఖరారయే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రకటించే అవకాశముంది. జగిత్యాల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్ మినహా మిగతా స్థానాలను సర్వే ఫలితాలతో పాటు కూటమి కేటాయింపుల్లో స్పష్టత ఆధారంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అమిత్‌షా సభ తర్వాతే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు బీజేపీ టికెట్ కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రామగుండం, వేములవాడ మినహా మిగతా తొమ్మిది స్థానాలకు ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రామగుండం, వేములవాడ అభ్యర్థులుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి, బండి సంజయ్, బల్మూరి వనిత, ప్రతాప రామకృష్ణ పేర్లు లాంఛనమే కాగా, మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ అభ్యర్థుల విషయంలో కూడా ఈనెల 3, 4, 5 తేదీలలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. ఈనెల 10న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభను ఏర్పాటు చేశారు. అమిత్‌షాతోపాటు ఈ సభకు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్నారు. ఈ సభ అనంతరమే అధికారికంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆరుస్థానాల నుంచి వైఎస్సార్సీపీ... రెండో విడతకు బీఎల్ఎఫ్ సిద్ధం.. దివంగత నేత, డాక్టర్ వైఎస్సార్ ఆశయాల సాధన, బడుగ పేద బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ సీపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ బలోపేతం అవుతోంది. వచ్చే ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని అధిష్టానం యోచిస్తోంది. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్తోపాటు మరోమూడు స్థానాల నుంచి పోటీచేసే విషయం ఆలోచన చేస్తోంది. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరుకు డాక్టర్ కె.నగేష్, అక్కెనపల్లి కుమార్, ఎస్.అజయ్‌వర్మ పేర్లు లాంఛనమే కాగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెప్తున్నారు. కాగా సీపీఎం అలయెన్స్‌తో బహుజన వామపక్ష కూటమి (బీఎల్ఎఫ్) ఇప్పటికే తొలి విడతగా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌కు వసీం అహ్మద్, మానకొండూరుకు మర్రి వెంకటస్వామి, చొప్పదండికి కనకం వంశీకిరణ్ పేరును ఖరారు చేశారు. రామగుండంలో సీపీఎం అభ్యర్థికి టికెట్ కేటాయించనుండగా.. మిగతా తొమ్మిది స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరుత్తు చేస్తోంది. ఈనెల 12 తేదీ వరకు మలి విడత జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. -
పొత్తుల చుట్టూ.. విపక్షాల అభ్యర్థిత్వాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ఊరూరా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థును ఖరారు చేయక మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఇన్నాళ్లూ వ్యవహరించిన కాంగ్రెస్‌తో ఆయా పార్టీలు ఎన్నికల పొత్తులకు వెళ్లనుండడంతో అభ్యర్థుల ఖరారు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను టీఆర్ఎస్ పది స్థానాల్లో టికెట్లు ఖరారు చేసింది. కోదాడ, హుజూర్‌నగర్‌లలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలన్నీ తాము పోటీ చేసే స్థానాలు, అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో ఇంకా ఎటూ నిర్ణయించుకోలేదని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాయని ఆ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఎదురు చూస్తున్న సీపీఐ, టీడీపీ, టీజేఎస్, ఇంటి పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటన్న స్థానాలపై ఒక అవగాహనతో ఉన్నాయని, కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు అయితే, ఆ స్థానాలు తెలుస్తాయని, ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో.. ఎవరు ఎక్కడ ? గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుని దేవరకొండ, మునుగోడుల్లో పోటీ చేసింది. దేవరకొండలో గెలిచిన ఆ పార్టీ, మునుగోడులో మాత్రం ఓడిపోయింది. దేవరకొండలో సీపీఐ తరఫున గెలిచిన రవీంద్ర కుమార్ ఆ తర్వాత టీఆర్ఎస్లోకి మారారు. ఎస్టీ రిజర్వుడు స్థానమైన దేవరకొండలో సీపీఐకి నాయకత్వం కొరత ఉందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఆ పార్టీ జిల్లాలో కేవలం మునుగోడు మాత్రమే అడిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇక్కడినుంచి కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత ఎన్నికల్లో పార్టీ రెబల్‌గా పోటీచేసి పాల్వాయి స్రవంతి, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. వీరిద్దరే కాకుండా పున్న కైలాస్, నారబోయిన రవి యువత కోటాలో తమకు టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ, ఇక్కడ సీపీఐతో వ్యవహారం తేలితే కాని అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఉంది. కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్, నల్లగొండలో సిట్టింగులు ఉన్నందున ఇక్కడ సమస్య కాకపోవచ్చని, మిర్యాలగూడలో కొత్తగా అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన భాస్కర్ రావు టీఆర్ఎస్లోకి మారడంతో ఈసారి ఇక్కడ మరొకరిని ఎంచుకోవాల్సి ఉందంటున్నారు. ఆలేరులో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ ఒక్కరే రేసులో ఉన్నారు. భువనగిరి అభ్యర్థిత్వం విషయంలోనూ స్పష్టత లేదు. తుంగతుర్తిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ ఈ సారి టికెట్ ఆశిస్తున్నా, ఆయనను స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోందని, దామోదర్‌రెడ్డి మొగ్గు ఎవరి వైపు ఉంటుందో వారికి టికెట్ దక్కొచ్చన్న సాధారణ అభిప్రాయం ఉంది. సూరాపేటలో గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి ఈసారీ రేసులో ఉన్నారు. టికెట్ హామీపైనే టీడీపీ సూర్యాపేట అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్ రమేష్‌రెడ్డి టికెట్ హామీపైనే రేవంత్‌రెడ్డితో కలిసి పార్టీ మారారు. ఆయనా టికెట్ కోరుతున్నారు. దీంతో ఇక్కడ పీఠముడి పడినట్లే. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆశిస్తూ .. ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే, ఇక్కడ మరో ముగ్గురు టికెట్ రేసులో ఉన్నారు. పొత్తంటూ కుదిరితే ఈ స్థానం తమకు కావాల్సిందేనని టీడీపీ గట్టిగా కోరుతోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కోరే స్థానం కూడా ఇదేనని అంటున్నారు. కోదాడలో సిట్టింగ్ ఉన్నా, టీడీపీ ఈ స్థానాన్నీ కోరుతోంది. పొత్తుల విషయంలో ఏదో ఒకటి తేలితే కానీ ఈ స్థానాల్లో అభ్యర్థులు తేలేలా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒంటరిగా .. బరిలోకి ! వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, బీఎల్ఎఫ్ కూటమితో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. ఈ పార్టీలూ ఇప్పటి దాకా పోటీ చేసే స్థానాల విషయంలో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. బీజేపీ పన్నెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, ఆ మేరకు కార్యాచరణ సిద్ధం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులతో కాకుండా, సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తెలంగాణ జనసమితి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జిల్లాలో మిర్యాలగూడ స్థానాన్ని కోరనుందని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సైతం హుజూర్నగర్, సూర్యాపేట, నకిరేకల్, మిర్యాలగూడ తదితర స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. టికెట్ల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి దారికి తెచ్చుకునే పనిలో టీఆర్ఎస్ నాయకత్వం నిమగ్నమైంది. మరోవైపు ఆ పార్టీ అభ్యర్థులు అసమ్మతి వర్గాల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారైతే కానీ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకోదని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏ హామీ నెరవేర్చారని ముందస్తుకు వెళ్తున్నారు
-
నిరుద్యోగ గర్జన సక్సెస్
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్ : నీళ్లు, నిధు లు, ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని.. సర్కారు మోసాన్ని ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి కరీంనగర్ జిల్లా కేంద్రంగా శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నిరుద్యోగ గర్జన’ విజయవంతం అయ్యింది. కలెక్టరేట్ ప్రాంతం అంతా వైఎస్సార్ సీపీ జెండాలో కళకళలాడింది. యువకుల బైక్‌ర్యాలీ, కళాకారుల నృత్యాల మధ్య వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. దివంగత వైఎస్సార్ విగ్రహంతో సభవరకు ర్యాలీగా వెళ్లారు. సదస్సులో పలువురు నాయకులు, నేతలు తమ వాణిని వినిపించారు. ఉద్యోగాల సాధన కోసం ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో ప్రజలకు లబ్ధిచేకూర్చిన పథకాలు.. పాలనపై కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. సభలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి. -
నిరుద్యోగుల ర్యాలీకి వైఎస్సార్సీపీ తెలంగాణ మద్దతు
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు అప్పటి ప్రభుత్వాలు అనుమతినిచ్చిన విషయాన్ని ఒక ప్రకటనలో గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, ఉద్యమాలతో సాధిం చుకున్న రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదన్నారు. -
కొత్త జిల్లాలకు త్వరలో కొత్త నాయకత్వం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు సాక్షి, హైదరాబాద్: పునర్ విభజనలో భాగంగా ఏర్పాటైన 31 జిల్లాలకూ త్వరలో అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన అత్యవసరంగా భేటీ అయ్యారు. కేసీఆర్ జిల్లా విభజనను ఏ ఉద్దేశంతో చేసినా అది పరోక్షంగా పార్టీల బలోపేతానికి దోహదపడుతుందని గట్టు అన్నారు. భారీ వర్షాలతో రైతులకు, నగర ప్రజలకు కలిగిన ఇబ్బందులను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. ‘‘కల్తీ విత్తనాలతో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి. వారికి రుణ మాఫీ చేయడమే గాక కేంద్రం ఇచ్చిన రూ.750 కోట్ల సబ్సిడీని తక్షణమే వారి ఖాతాలకు జమ చేయాలి. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించి కార్పొరేట్, ప్రయివేట్ ఆస్పత్రులు సమ్మెకు దిగకుండా చూడాలి’’ అని కోరారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ లేక వేలాది మంది విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారిందని పార్టీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. రూ.2 వేల కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, బోయినపల్లి శ్రీనివాసరావు, జె.మహేందర్ రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, మతీన్, నేతలు నర్రా భిక్షపతి, బొడ్డు సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల ప్రకటన
♦ ఇద్దరు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ♦ 18 మంది కార్యదర్శులు ♦ ఐదు జిల్లాలకు కొత్త అధ్యక్షులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్సీపీ గురువారం పార్టీ కమిటీలను ప్రకటించింది. ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, 18 మంది కార్యదర్శులతో రాష్ట్ర కమిటీ జాబితాను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ కమిటీలను నియమించారు. రాష్ట్ర కమిటీ లో వీరే..: రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి(వరంగల్), మతిన్ అహ్మద్ ముజాధీ(హైదరాబాద్)ను నియమించారు.రాష్ట్రకార్యదర్శులుగావడ్లోజులవెంకటేశ్(నల్లగొండ),జి.రాంభూపాల్‌రెడ్డి(మహబూబ్‌నగర్),తుమ్మలపల్లిభాస్కర్(నల్లగొండ),మేములశేఖర్రెడ్డి(నల్లగొండ),ఇరుగుసునీల్(నల్లగొండ), ఎం.గవాస్కర్‌రెడ్డి(నల్లగొండ),కుసుమకుమార్‌రెడ్డి(రంగారెడ్డి),పి.కుమార్‌యాదవ్(రంగారెడ్డి),ఎం.ప్రభుకుమార్(రంగారెడ్డి),పిట్టారామిరెడ్డి(నల్లగొండ),యస్.హరినాథ్‌రెడ్డి(హైదరాబాద్),డా.కె.నగేశ్(కరీంనగర్), బసిరెడ్డిబ్రహ్మానందరెడ్డి(రంగారెడ్డి),కొమ్మరవెంకటరెడ్డి(మెదక్),బి.సంజీవరావు(మెదక్),ఆర్.చంద్రశేఖర్(మెదక్),మెట్టురాఘవేంద్ర(హైదరాబాద్), తడక జగదీశ్వర్‌గుప్తా(మెదక్)ను నియమించారు. ఐదు జిల్లాలకు అధ్యక్షులు: ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. బొడ్డు సాయినాథ్‌రెడ్డి(గ్రేటర్ హైదరాబాద్), నాడెం శాంతికుమార్(వరంగల్), జి.శ్రీధర్‌రెడ్డి(మెదక్) ఎం.భగవంతరెడ్డి(మహబూబ్‌నగర్), వి.అనిల్‌కుమార్(ఆదిలాబాద్)ను నియమించారు. వీరితోపాటు గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎ.అవినాష్‌గౌడ్, నల్లగొండ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పచ్చిపాల వే ణును నియమించారు. ఏడు అనుబంధ విభాగాలకు కూడా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా గంది హనుమంతు, రాష్ట్ర వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడిగా నర్రా బిక్షపతి, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా డా.పి.ప్రపుల్లా రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నీలం రమేష్, రాష్ట్ర ముస్లింమైనార్టీ విభాగం అధ్యక్షుడిగా మతిన్ అహ్మద్ ముజాధీ, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడిగా మెండెం జయరాజ్, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా బి.శ్రీవర్ధన్రెడ్డిను నియమించారు. -
తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కే శివకుమార్, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రహ్మాన్ లు బాధ్యతలు స్వీకరించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం.. పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కే శివకుమార్లను నియమించారు. ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి వ్యవహరిస్తారు. వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రహ్మాన్లను నియమించారు. ఇటీవల జరిగిన వైఎస్ఆర్ సీపీ తెలంగాణ ముఖ్యనేతల విస్తృత సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలన్నింటినీ రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు, కమిటీలను నియమించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అప్పగిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. -
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే పార్టీ విలీనమైనట్లు కాదు: వైఎస్సార్సీపీ తెలంగాణ సాక్షి, హైద రాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరడాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని వారు ఒక ప్రకటనలో గుర్తు చేశారు. వందకు వంద శాతం సభ్యులు వేరొక పార్టీలో చేరినా అది రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేశారు. తన నిర్ణయానికి ఉన్న రాజ్యాంగ బద్ధత ఏమిటో స్పీకర్ వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు తావివ్వడమంటే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గౌరవం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని వెల్లడించారు. -
సుచరితకు మద్దతుపై మార్పులేదు: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికపై తమ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితకు మద్దతు కొనసాగుతుందని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ స్పష్టం చేసింది. చట్టసభల సభ్యులు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులే అభ్యర్థి అయితే పోటీ పెట్టరాదన్నది తమ పార్టీ ఆవిర్భావం నుంచి అనుసరిస్తున్న విధానమన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుచరిత పోటీ చేస్తున్నందున ఆమెకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ గతంలోనే నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. వైఎస్సార్సీపీ, తెలంగాణ విభాగం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైదొలగిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి తమ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని మంగళవారం ఓ ప్రకటనలో పునరుద్ఘాటించింది. -
ప్రత్యుషకు పొంగులేటి పరామర్శ!
-
కలసికట్టుగా పనిచేయండి
* జీహెచ్ఎంసీ ఎన్నికలతర్వాత తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండాలి * పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి పిలుపు సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తలెత్తుకొని తిరిగే పరిస్థితి కల్పించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నగర అనుబంధ విభాగాలు, పార్టీ నగర, రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. పార్టీ నగర అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీలో, పదవుల్లో ఉన్న వారందరూ తాము ఏ మేరకు పనిచేస్తున్నామనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీ పదవితో సరిపెట్టుకుంటారా లేక ప్రజల్లో కసిగా పనిచేసి ప్రజాప్రతినిధి కావాలనుకుంటున్నారా అని ప్రశ్నిం చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖమ్మం జిల్లాలో తనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాననే నమ్మకం తనకుందని పొంగులేటి చెప్పారు. ఖమ్మంలో గల్లీగల్లీ తిరుగుతున్నానని, ఒక్కడిని ఎంతని పనిచేయగలనని, బాగా పనిచేసేవారు పది మంది తన వెంట ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చక్రం తిప్పుతానన్న నమ్మకం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హడావుడి చేస్తే లాభం ఉండదని, పార్టీ నిర్ణయాలు అమలు చేయనపుడు పార్టీ ఎలా పెరుగుతుందన్నారు. పదవులు కావాలంటే ఇచ్చామని, పార్టీకీ, మీకు మైలేజ్ వచ్చేలా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ఒక ప్రణాళిక రూపొందించుకుని అందరూ కలసికట్టుగా ముందుకు నడవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్లో అనుబంధ విభాగాల కమిటీ వేసి పనిచేస్తే, రాబోయే నాలుగేళ్లలో మహాశక్తిగా ఎదుగుతామన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందరం కష్టపడి పనిచేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, పార్టీ అనుబంధ విభాగాలైన డాక్టర్స్, సేవాదళ్, ఐటీ, యువజన విభాగాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.ప్రఫుల్లా రెడ్డి, వెల్లాల రాంమోహన్, సందీప్ కుమార్, భీష్వ రవీందర్, మహిళా నేతలు క్రిష్టోలైట్, శ్యామల, పార్టీ రాష్ట్ర నాయకులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, జితేందర్ తివారీ, బి. మోహన్ కుమార్, మైనార్టీ నేత హర్షద్, నగర యువజన, విద్యార్థి విభాగాల నేతలు అవినాష్‌గౌడ్, సాయికిరణ్‌గౌడ్, నాగదేసి రవికుమార్, నీలం రాజు, శ్రీకాంత్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేయండి
శుక్రవారం లోటస్ పాండ్ లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో నల్లా సూర్యప్రకాశ్, శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి గాదె నిరంజన్ రెడ్డి తదితరులు * రంగారెడ్డి జిల్లాలో 29న జిల్లెలగూడ మంద మల్లమ్మచౌరస్తా నుంచి యాత్ర ప్రారంభం * వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి * ప్రతి కార్యకర్తా నాలుగు రోజులూ షర్మిల వెంట నడవాలి * పరామర్శయాత్ర నియోజవర్గ ఇన్చార్జిలతో భేటీ సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న పరామర్శ యాత్రను జయపద్రం చేయాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తతోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న నాయకులంతా ఈ నాలుగు రోజులు షర్మిల వెంట నడవాలన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి అధ్యక్షతన ‘పరామర్శ యాత్ర నియోజకవర్గ ఇన్చార్జి’లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి ఆమె జిల్లెలగూడ మంద మల్లమ్మ చౌరస్తా, కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి మహానేత వైఎస్సార్ ఆకస్మిక మృతి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్నారు. ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి వారికి భరోసా కల్పిస్తారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ కార్యదర్శి ఎనుగు మహిపాల్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహిళా నేతలు అమృతసాగర్, సూరజ్ ఎజ్ధానీ, జి.ధనలక్ష్మి, ఎం.శ్యామల, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం. ప్రభుకుమార్, కార్మిక నేత నర్రా భిక్షపతి, మైనార్టీ నేతలు ముజ్తబ అహ్మద్, మసూం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నగర యువజన, సేవాదళ్ విభాగాల అధ్యక్షులు ఎ.అవినాష్‌గౌడ్, బండారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సదారాంను తొలగించాలి
సీఈవోకు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ వినతి సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి అనుకూలంగా, పక్షపాత వైఖరితో పనిచేస్తున్న అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేసింది. సదారాం స్థానంలో మరో అధికారిని నియమించి ఎన్నికలను నిర్వహించాలని కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, హెచ్ఏ రెహమాన్ వినతిపత్రాన్ని సమర్పించారు. అభ్యంతరాలుంటే తెలపండి: భన్వర్‌లాల్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఇద్దరు పరిశీలకులను నియమించామని, అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రూపొందించిన ఎమ్మెల్యేల ఓటర్ల జాబితాలో ఏయే పార్టీలకు వారు ప్రాతి నిధ్యం వహిస్తున్నారనే వివరాలు లేకుండానే సదారాం ప్రచురించారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నామినేషన్ల ముగింపునకు ముందు జాబితాలో పార్టీల పేర్లను పొందుపరిచారని వారు సీఈవోకి తెలిపారు. ఇది కావాలనే చేశారని, పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈ జాబితా ద్వారా అర్హులైన ఓట ర్లుగా చేసే ప్రయత్నం జరిగిందని వారు వివరించా రు. అనంతరం కె.శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరినట్లు తెలిపారు. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్య తీసుకోవాలని తాము కోర్టునూ ఆశ్రయించామన్నారు. వీరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించవద్దని కోరామన్నారు. -
అంతం కాదిది ఆరంభం
⇒ సర్కారు కళ్లు తెరిపించేందుకే రైతు దీక్ష: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి ⇒ ఈ దీక్షలు రాజకీయం, ఓట్ల కోసం కాదు ⇒ రైతుల ఆత్మహత్యలు పట్టని కేసీఆర్.. తాను రైతునని ఎలా చెప్పుకుంటారు? ⇒ మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేసేదాకా ఉద్యమం.. కలిసొచ్చే అన్ని పార్టీలతో ఐక్య పోరాటాలు ⇒ సర్కారు కళ్లు తెరిపించేందుకే రైతు దీక్ష ⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘మేం రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో రైతుదీక్షలు చేయడం లేదు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, మా పార్టీ రైతుల పక్షాన ఉందని తెలియజేసేందుకు దీక్ష చేస్తున్నాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్నీ ప్రభుత్వం అమలు చేసేదాకా, సమస్యలన్నీ పరిష్కారమయ్యేదాకా తమ పోరాటాలు ఆగవన్నారు. ‘‘అంతం కాదిది ఆరంభం మాత్రమే. పార్టీ ప్రజల, రైతుల పక్షాన నిలిచి, కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొని వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది’’ అని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోఆదివారం పొంగులేటి ఒక్క రోజు రైతుదీక్ష నిర్వహించారు. సాయంత్రం రైతులు సంగెం వెంకటి, దేవానాయక్లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపటోళ్ల సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రైతులు, ప్రజలనుద్దేశించి పొంగులేటి మాట్లాడారు. ఏడాదిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్ రైతుల ఆత్మహత్యలను, సమస్యలను పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఆక్షేపించారు. ‘‘ఇది ైరెతు అనుకూల ప్రభుత్వం కాదు. రైతులు, బడుగు, పేద, బలహీన, దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం’’ అంటూ విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తానున్నానంటూ రైతన్న భుజం తట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు. తాము కూడా అండగా ఉండేందుకే దీక్ష చేపట్టామన్నారు. రైతులు, బడుగు, పేద, బలహీన, దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వమిది. రైతుల ఆత్మహత్యలను, సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు తాను రైతునని ఎలా చెప్పుకుంటారు? ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వంపై పోరాడతాం. కలిసొచ్చే పార్టీలతో ఐక్య ఉద్యమాలు చేస్తాం. - కామారెడ్డి ‘రైతుదీక్ష’లో పొంగులేటి పోడుభూములూ లాక్కుంటారా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే కనీసం పట్టించుకోని కేసీఆర్, తాను రైతునని ఎలా చెప్పుకుంటారని పొంగులేటి ప్రశ్నించారు. ‘‘రైతుబిడ్డని, ఎకరాకు రూ.70 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పుకుంటున్నారు. రైతుల కష్టాలు, బాధలు తెలిసుండి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న మీరు రైతునంటే ప్రజలెలా నమ్ముతారు?’’ అని ప్రశ్నించారు. వైఎస్ పోడు భూములకు పట్టాలిస్తే, నేటి ప్రభుత్వాలు ఆ పట్టాలను రద్దు చేసి రైతులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మాటతప్పారు. ఉచిత కరెం ట్ 9 గంటలి స్తామన్నా రెండు గంటలకు మించడం లేదు. దాంతో పొలాలెండి.. భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి సాగు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించింది. రెండో పంటకు కరెంటివ్వలేమంటూ చేతులెత్తేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థను కాపాడింది వైఎస్సే కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతోంది. 2004లో వైఎస్ ఆధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి అండగా నిలిచారు. నష్టాల నుంచి లాభాల బాట పట్టించారు. విద్యుత్, ఆర్టీసీ సంస్థలు నేటికీ క్షేమంగా ఉన్నాయంటే వైఎస్ చలవే’’ అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను తక్షణం విరమింపజేయాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు సరిగా ఇవ్వడం లేదన్నారు. ‘‘దళితులకు మూడెకరాల హామీనీ నెరవేర్చడం లేదు. ఖమ్మం జిల్లాలో 26 వేల మంది అర్హులుంటే కేవలం 15 మందికిచ్చి చేతులు దులుపుకున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, 104, 108... ఇలా ఏ పథకాన్నీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా వైఎస్ ముద్రను చెరిపేందుకు కుట్రలు చేస్తున్నారు. జలయజ్ఞం కింద తెలంగాణలో ఆయన చేపట్టిన 37 ప్రాజెక్టుల్లో 5 పూర్తయ్యే దశలో ఉన్నా ప్రభుత్వం ఒక్కదాన్నీ పూర్తి చేయలేదు’’ అని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మశాంతి కోసం దీక్షకు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీఎం నియోజకవర్గంలోనే ఆత్మహత్యలు: పాయం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇందుకు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన ఆత్మహత్యలే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం వారిని పరామర్శించలేదని మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రే షియా చెల్లిచాలని అసెంబ్లీలో కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. తమ దీక్షతోనైనా ప్రభుత్వం మేల్కొని తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోడు రైతులను ప్రభుత్వం జైళ్లకు పంపుతోందని ఆరోపించారు. వారికి పట్టాలివ్వాలని కోరారు. రైతుదీక్షలో పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, గున్నం నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు విజయచందర్, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, యువజన విభాగం నేత భీష్మ రవిందర్, రాష్ట్ర పార్టీ నాయకులు ఏలూరు వెంకటేశ్వర్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, కేసర వెంకటేశ్వర్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, ముందడుపు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కష్టాల ఏకరువు అన్నదాతల కష్టాలను ఏకరువు పెట్టేందుకు రైతుదీక్ష వేదికైంది. పంటలు నష్టపోయిన రైతులతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబసభ్యులు ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల కష్టాలను ఓపికగా విన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. రైతుల ఆవేదన వారి మాటల్లోనే.. పొలంకాడనే పురుగుల మందు తాగి సచ్చిండు అప్పులతో నా మొగడు పొలంకాడ మందుతాగి సచ్చిపోయిండు. నాకు కొడుకు, బిడ్డ ఉన్నరు. సర్కారు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ సాయం చేయలేదు. నేనెట్ల బతకాలె. నా పిల్లల్నెట్ల బతికుంచుకోవాలె. అప్పులు అట్లనే ఉన్నయి. బతుకుదెరువు కూడా కరువైంది. పిల్లల కోసమే బతుకుతున్నా. నన్ను సర్కారే ఆదుకోవాలి. - ఆత్మహత్యకు పాల్పడిన రైతు జెల్లె సుధాకర్ భార్య మణెమ్మ, నర్సాపూర్, మెదక్ పింఛన్ రావట్లేదు నా భర్త చనిపోయి 20 ఏళ్లయింది. నాకు పింఛన్ రావట్లేదు. ఎవరి దగ్గరికి పోయినా పట్టించుకోవడం లేదు. దయసేసి పింఛన్ ఇప్పించండి. - ఎనగుర్తి పోశవ్వ, లింగాపూర్, కామారెడ్డి, నిజామాబాద్ లోన్లు మాఫీ కాలేదు గ్రూపుల లోన్లు మాఫీ అవుతాయని ఆశపడ్డం. మాఫీ కాలేదు. మిత్తీలు పెరిగి అప్పు భారంగా తయారైంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం నమ్మించి మమ్మల్ని మోసం చేసింది. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు మంచిగ ఉండె. గ్రూపుల లోన ్లన్నీ మాఫీ చెయ్యాలె. మహిళలను ఆదుకోవాలె. - పుష్ప, కన్నాపూర్, లింగంపేట, నిజామాబాద్ ఉరేసుకుని సచ్చిపోయిండు నా భర్త అప్పుల బాధతో ఉరేసుకుని సచ్చిపోయిండు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో గోస పడ్డం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వమూ ఆదుకోలేదు. బతుకుడు కష్టంగా ఉంది. సర్కారు నుంచి సాయం ఇప్పించండి. - ఆత్మహత్యకు పాల్పడిన శంకరయ్య భార్య లక్ష్మి, పుల్లూరు, మెదక్ రైతు దీక్షలో ఏడు తీర్మానాలు పొంగులేటి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుదీక్షలో ఏడు ప్రధాన తీర్మానాలను ఆమోదిం చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి ఈ తీర్మానాలను ప్రవేశపెట్టగా సభకు హాజరైన రైతులు, నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆ తీర్మానాలివే.. ⇒ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. ⇒ ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనందున తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. రైతులకు కరువు సహాయం అందించాలి. ⇒ అకాలవర్షాలు, బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో జరిగిన పంట నష్టానికి తగిన పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ⇒ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రూ.25 వేలు మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.75 వేలను కూడా ఒకేసారి మాఫీ చేయూలి. ⇒ వచ్చే ఖరీఫ్‌లో ఉచితంగా విత్తనాలు, సగం ధరకే ఎరువులు అందించి తోడ్పడాలి. ⇒ కబేళాలకు తరలిపోకుండా పశువులకు ఉచితంగా మేత, పాడి పశువులకు దాణా అందించి పశుసంపదను కాపాడాలి. ⇒ రైతుల భూములను బలవంతంగా, వారికి ఇష్టం లేకుండా లాక్కోవద్దు. -
కామారెడ్డిలో ప్రారంభమైన పొంగులేటి రైతుదీక్ష
-
కామారెడ్డిలో ప్రారంభమైన పొంగులేటి రైతుదీక్ష
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వరంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష ప్రారంభమైంది. ఈ రైతు దీక్ష రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు. హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 2014 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 784 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 140 కాగా, కరీంనగర్లో 115, ఆదిలాబాద్‌లో 98 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50 మందికిపైగా రైతులు తనువు చాలించారు. కాడినే నమ్ముకున్న రైతులను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత పట్టించుకునేవారు లేకుండా పోవడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు, రైతు సంఘాల గణాంకాల ప్రకారం 784 మంది రైతులు మృతి చెందారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 96 మంది రైతులు మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది. కనీసం ఆ 96 మంది రైతు కుటుంబాలను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, వారి ఆత్మహత్యలపై పోరాటం కోసం నడుంకట్టింది. -
కేసీఆర్‌ను మేల్కొలిపేందుకే రైతు దీక్ష
- వైఎస్సార్సీపీ నేత శివకుమార్ వెల్లడి - మైనార్టీ సోదరులందరూ తరలిరావాలని విజ్ఞప్తి - పోస్టర్ విడుదల హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు... ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మేల్కొలిపేందుకు రైతన్నకు అండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుదీక్ష చేపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాస రెడ్డి దీక్ష చేపడుతున్నారన్నారు. అక్కడ ఏపీ రాష్ట్రంలోనూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి తిరిగి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లోని మైనార్టీ సోదరులందరూ ఎంపీ శ్రీనివాస రెడ్డి చేపట్టే దీక్షలో పాల్గొనాలని కోరారు. గారడీ మాటలొద్దు: వైఎస్సార్ సీపీ నగర యువజన విభాగం రైతులు కరువు పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వడగండ్ల వర్షాలు మరింత నష్టం తెచ్చిపెట్టాయని ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ గాల్లో తిరుగుతూ గారడీ మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నగర విభాగం అధ్యక్షుడు ఎ. అవినాష్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆదర్శ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రచార పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. వేరువేరు చోట్ల జరిగిన ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో నగర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.రిజ్వాన్ హుస్సేన్, కమిటీ సభ్యులు ఎం అల్తాఫ్ ఉద్దీన్, ఎం.ఇస్మాయిల్, ఫైషల్ షా, అబుల్ ఖైర్ సిద్దికీ, నగర యువజన విభాగం నాయకులు కపిల్, ఫైజల్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
- చిత్తశుద్ధి లోపిస్తే ‘మిషన్ కాకతీయ’ ఓ చెత్త కార్యక్రమం - రైతుల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి - వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి కల్లూరు: ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, ఏ సంక్షేమ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం ఖమ్మం జిల్లా కల్లూర్ మండలం నారాయణపురంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రైతులు పంట ఉత్పత్తులను దళారులకు తక్కువ రేటుకు అమ్ముకోలేక మార్కెట్లకు తీసుకొస్తుంటే అక్కడ వెంటనే కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. రుణమాఫీ ఒకేసారి చేసి, రైతులకు కొత్తగా పంట రుణాలు అందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాణ్యత గల ఎరువులు, విత్తనాలు జిల్లాకు ఎంత అవసరమో గుర్తించి పంపిణీ చేయాలన్నారు. వాటర్ గ్రిడ్‌తో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హంగామా చేస్తోందని, ఆ పనులు పూర్తయ్యేసరికి నాలుగేళ్లు పడుతుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్ని గుర్తించి నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికి వైద్యం చేయించాలని, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. చెరువులు అభివృద్ధి చెందుతాయన్నారు. చిత్తశుద్ధి కొరవడితే మాత్రం అంతటి చెత్త కార్యక్రమం ఇంకొకటి ఉండదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని కలలు కన్నారని, వాటిని సాఫల్యం చేయడానికే ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ ప్రతిపక్షపాత్ర పోషిస్తుందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి కీసర వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియూ ఇవ్వాలి
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి - వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్ మంకమ్మతోట : అకాలవర్షాలు, వడగళ్లవానతో పంటలు నష్టపోయి బలన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్ కోరారు. సోమవారం కరీంనగర్ వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పరామర్శించకపోవడం రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ చర్యలు లేకపోవడంతో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడంతోపాటు పశు సంపదను రక్షించుకునేందుకు పశుగ్రాసం సరఫరా చేయూలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన చెరువుల పూడికతీత గొప్ప కార్యక్రమని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయూలని కోరారు. డబుల్ బెడ్రూమ్ప్లాట్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ప్రారంభించాలని కోరారు. వార్డు సభ్యులకు సైతం గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. చిన్న చిన్నవాటిపై అతిగా స్పందిస్తున్న చంద్రబాబు టీడీపీ హయాంలో అసలు చేసిందేమి లేదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా చంద్రబాబు చెప్పుకుంటున్న టీడీపీ రానున్న రోజుల్లో కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్కౌంటర్ పేరిట చంద్రబాబు కూలీలను పొట్టపెట్టుకున్నారని, అది చాలక హత్యలు చేయిస్తూ రక్తపిశాసిలా మారారని ఆరోపించారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలను ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి సహాయ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి జైపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు మోకెనపెల్లి రాజమ్మ, బోగె పద్మ, కాసారపు కిరణ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా అధికార ప్రతినిధి గండి శ్యామ్, సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, హలీమొద్దీన్ ఫాహద్ సోనూ పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై అవసరమైతే నిరాహారదీక్ష
తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనుభవిస్తున్న సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనకాడేది లేదని వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించామని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులతో పాటు.. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలు ఈనెల 15వ తేదీలోపు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయనుకున్న ప్రజలు ఇప్పుడు నిరాశలో మునిగిపోయారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు కనీసం భరోసా ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశాన్ని మరోసారి స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. -
రైతు సమస్యలపై అవసరమైతే నిరాహారదీక్ష
-
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పొంగులేటి
-
అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్ పాలన: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పాలనను సాగించారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాతకు నేతలు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. అట్టడుగు వర్గాలు, దళితుల అభివృద్ధి, వారి సంక్షేమాన్ని అంబేడ్కర్ నిరంతరం కాంక్షించారని, చివరి వరకూ అందుకోసమే తపించారని పొంగులేటి కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళిత, బలహీన వర్గాలకు ఎక్కువ మేలును చేకూర్చే సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా వైఎస్ చేశారని పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వైఎస్ మాదిరిగానే సంక్షేమ పాలనను అందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచం గర్వించదగిన వ్యక్తి అంబేడ్కర్ అని, ఆయన ఒక్క దళితులకే నాయకుడు కాదని, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి అని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరుగని పోరాటం వందేళ్ల క్రితమే అంటరానితనం, దురాచారాలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ అలుపెరుగని పోరాటం చేశారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున శ్లాఘించారు. ఆయన కాంక్షించిన బడుగు వర్గాల సంక్షేమాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ ఆలోచన లు అంబేడ్కర్ ఆశయాలకు అద్దం పట్టేవిగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. ప్రజలందరి సంక్షేమానికి పాటుపడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి వైఎస్ కట్టుబడి పాలన సాగిస్తే ఇప్పటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పౌరహక్కులను కాలరాస్తూ అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో స్మగ్లర్లనే పేరుతో 20 మంది దళిత కూలీలను కాల్చిచంపడం, తెలంగాణలో వికారుద్దీన్ బృందాన్ని హతం చేయడం పౌరహక్కులను హరించడమేనన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నేతలు కొండా రాఘవరెడ్డి, వాసిరెడ్డి పద్మ, చల్లా మధుసూదన్‌రెడ్డి, డా. ప్రపుల్ల రెడ్డి, వెల్లాల రామ్మోహన్, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, కె.వెంకటరెడ్డి, దుద్దుకూరు శ్రీధర్ రెడ్డి, ఎం. జయరాజ్, నాగదేశి రవికుమార్, బండారు సుధాకర్, జార్జిహెర్భట్, ఎం.సందీప్‌కుమార్, వనజ, శ్యామల, క్రిస్టోలైట్ అంబేడ్కర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ
-
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ
* మతీన్ అహ్మద్, గాదె నిరంజన్‌రెడ్డి * సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా విజయచందర్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని శుక్రవారం విస్తరించారు. ఈ మేరకు తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జాబితా విడుదల చేశారు. పార్టీ తెలంగాణ కార్యవర్గం విస్తరణలో భాగంగా... ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్), మతీన్ అహ్మద్ ముజదాది (హైదరాబాద్), గాదె నిరంజన్‌రెడ్డి (నల్లగొండ) నియమితులయ్యారు. కార్యదర్శులుగా ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సయ్యద్ ఉద్దీన్ ముఖ్తార్ (నిజామాబాద్), ఎ.పద్మారెడ్డి (రంగారెడ్డి), జి.శ్రీధర్‌రెడ్డి (మెదక్), తుమ్మలపల్లి భాస్కర్ , వేముల శేఖర్‌రెడ్డి (నల్లగొండ), అక్కనపల్లి కుమార్ (కరీంనగర్), కె.పాండురంగాచార్యులు, పాకలపాటి చందు (ఖమ్మం), ఎం.ప్రభు కుమార్ (రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్) నియామకం అయ్యారు. ఇక సంయుక్త కార్యదర్శులుగా.. ధనలక్ష్మి (రంగారెడ్డి), బి.హనుమంతు (మహబూబ్‌నగర్), కె.సుదీప్‌రెడ్డి (నిజామాబాద్), మహమూద్ (హైదరాబాద్), జేవీఎస్ చౌదరి (ఖమ్మం), పిట్టా రామిరెడ్డి, ఎన్.స్వామి, ఎండీ సలీమ్ (నల్లగొండ), కె.నగేష్ (కరీంనగర్), బి.శ్రీనివాసరెడ్డి (రంగారెడ్డి)లను నియమించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కొండల్‌రెడ్డి, బి.సంజీవరావు (మెదక్), బి.బ్రహ్మానందరెడ్డి (రంగారెడ్డి), బెజ్జం శ్రీనివాసరెడ్డి (ఖమ్మం) నియమితులయ్యారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా విజయచందర్ పార్టీ తెలంగాణ కమిటీ సాంస్కృతిక, ప్రచార విభాగం అధ్యక్షుడిగా సినీ నటుడు టీఎస్ విజయచందర్ (హైదరాబాద్) నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఎస్.నరేష్, సుంకరపల్లి జగతి (కరీంనగర్), కార్యదర్శిగా చెరుకు శ్రీనివాస్ (రంగారెడ్డి), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా భీమ శ్రీధర్ (ఖమ్మం), రాష్ట్ర సేవాదళ్, వలంటీర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నీలం రమేశ్ (నిజామాబాద్), రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నయీం ఖురేషీ (ఖమ్మం), రాష్ట్ర డాక్టర్స్ విభాగం కార్యదర్శిగా డా.డోరేపల్లి శ్వేత (ఖమ్మం), రైతు విభాగం కార్యదర్శిగా యు.లక్ష్మీరెడ్డి(ఖమ్మం), రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కె.రామాచారి (ఖమ్మం) నియమితులయ్యారు. హైదరాబాద్ నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కొండా సాయికిరణ్‌గౌడ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ అర్షద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.రామేశ్వరీ శ్యామల నియమితులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా బి.అనిల్‌కుమార్, నల్లగొండ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా ఐల వెంకన్నగౌడ్లను నియమించారు. జిల్లాల పరిశీలకులు, సహ పరిశీలకులు.. రంగారెడ్డి పార్టీ పరిశీలకుడిగా కె.శివకుమార్, సహ పరిశీలకులుగా వడ్లోజుల వెంకటేష్, పి.రామిరెడ్డి. వరంగల్ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, సహ పరిశీలకులుగా ఆకుల మూర్తి, జి.శ్రీధర్‌రెడ్డి. నల్లగొండ పరిశీలకుడిగా ఎడ్మ కిష్టారెడ్డి, సహ పరిశీలకులుగా షర్మిలా సంపత్, ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి. మెదక్ పరిశీలకుడిగా మతీన్ అహ్మద్, సహ పరిశీలకులుగా ఎ.పద్మారెడ్డి, జి.రాం భూపాల్‌రెడ్డి. హైదరాబాద్ పరిశీలకుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సహ పరిశీలకులుగా తుమ్మలపల్లి భాస్కర్, సయ్యద్ ఉద్దీన్ ముఖ్తార్. ఆదిలాబాద్ పరిశీలకుడిగా ఎం.భగవంత్‌రెడ్డి, సహ పరిశీలకులుగా విలియం మునగాల, బి.శ్రీనివాసరావు. కరీంనగర్ పరిశీలకుడిగా నల్లా సూర్యప్రకాష్, సహ పరిశీలకులుగా జి.జైపాల్‌రెడ్డి, కె.వెంకటరెడ్డి. నిజామాబాద్ పరిశీలకుడిగా గాదె నిరంజన్‌రెడ్డి, సహ పరిశీ లకులుగా కె.ఉపేంద్రరెడ్డి, అక్కెనపల్లి కుమార్. ఖమ్మం జిల్లా పరిశీలకుడిగా సత్యం శ్రీరంగం, సహ పరిశీలకులుగా వై.మహిపాల్‌రెడ్డి, జి.సూర్యనారాయణరెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ పరిశీలకుడిగా గున్నం నాగిరెడ్డి, సహ పరిశీలకులుగా కె.సుదీప్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి. -
తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలి
* స్పీకర్‌కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ఫిర్యాదు * మీడియా క్లిప్పింగులతో పిటిషన్ సమర్పించిన నేతలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), బానోత్ మదన్‌లాల్ (వైరా)లపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్, పార్టీ ఫిరాయింపుల నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరిట రెండు పిటిషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌కు తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, రైతు విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి వీటిని అందజేశారు. వీరిద్దరూ కూడా వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తుపై అసెంబ్లీకి ఎన్నికై సీఎం కేసీఆర్ సమక్షంలో వేర్వేరు సందర్భాల్లో టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. తాము స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతో పదవ షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. జనవరి 9న హన్మకొండలో సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సమక్షంలో పార్టీ ఫ్లోర్‌లీడర్ తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. అదేవిధంగా గత సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు సమక్షంలో బానోత్ మదన్‌లాల్ టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఇందుకు సంబంధించిన టీవీ చానళ్ల క్లిప్పింగ్‌లు, వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను పిటిషన్లకు జతచేశారు. స్పీకర్ వేటువేయకపోతే న్యాయస్థానానికి.. తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్‌లపై అనర్హత వేటు వేసి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్వారావుపేట, వైరా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు కె.శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి డిమాండ్ చేశారు. తమ పిటిషన్లపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంను ఆదేశించారని వారు తె లిపారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ వీరిద్దరిపై అనర్హత వేటు వేయని పక్షంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై చర్య తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. -
పార్టీని బలోపేతం చేయండి
నిజామాబాద్ అర్బన్: గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు వైఎస్ఆర్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు పార్టీ బాగా ఉండేదని, మళ్లీ ఆ స్థాయికి తెచ్చేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని అన్నారు. రాబోయే 5,6 నెలలలో పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల కేంద్రాలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పా రు. అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్ధంగా ఉన్నవారిని, పాత నాయకులను తిరిగి పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించేలా చూస్తామన్నారు. ఇటువంటి నాయకుల జాబితాను నియోజకవర్గాలవారీగా తయారు చేసి తనకు అందజేయాల ని జిల్లా నాయకులను కోరారు. ముందుగా ఈ నాయకులతో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. నెలరోజులో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై స్పందించండి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కూలీల సమస్యలపై దృష్టి సారించాలని పొంగులేటి పేర్కొన్నారు. వారి వెన్నంటే ఉంటూ సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజల కు అందుబాటులో ఉండాలని, వారి అవసరాలను గుర్తించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నిఘా ఉంచాలన్నారు. వెంటనే పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని, గ్రామగ్రామాన కమిటీలను వేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలోనే కమిటీలను నియమించాలన్నారు. కమిటీలు చరుకుగా పని చేసేలా తగిన చర్యలు తీసుకోవాల న్నా రు. జిల్లాలోనివారికే పార్టీలో ప్రాధాన్యతనివ్వాల ని, చురుకుగా పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా కొందరు నాయకులు కోరా రు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని రాష్ట్ర నాయకులు హామీనిచ్చారు. ఈ భేటీలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి నాయుడు ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితుడు గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్రపార్టీ నాయకులు కొండారాఘవరెడ్డి, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, నిజామాబాద్ రూరల్ నాయకులు గంగారెడ్డి,సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఖమ్మంలో పొంగులేటికి ఘనస్వాగతం
-
రేపటి నుంచి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ జిల్లాల సమీక్ష
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విభాగం గురువారం నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. రేపు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సమావేశం ప్రారంభం
-
తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. అత్తాపూర్ క్రిస్టల్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సమావేశానికి వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా హాజరు అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ పది జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరు అయ్యారు. సాయంత్రం వరకు జరిగే సమావేశంలో పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేయటం, తెలంగాణ ప్రజల సమస్యలపై పోరుబాట వంటి అంశాలపై చర్చించనున్నారు. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సమస్య, పింఛన్ల కోత, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 సేవలకు అంతరాయం తదితర అంశాలపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని పటిష్టం చేయటం, ప్రజల పక్షాన పోరాడటమే తమ ముందున్న లక్ష్యాలనీ, పార్టీ శ్రేణులకు జగన్మోహన్రెడ్డి, ఇతర నేతలు దిశానిర్దేశం చేస్తారు. -
నేడు వైఎస్సార్సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం
-
నేడు వైఎస్సార్సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం
* పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపైనే ప్రధాన చర్చ * హాజరు కానున్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి * వేదిక మెహిదీపట్నం క్రిస్టల్ గార్డెన్స్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి విస్తృత స్థాయి సమావేశానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్ (పిల్లర్ నెంబర్ 86)లో జరిగే ముఖ్య నాయకుల సమావేశానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేయటం, తెలంగాణ ప్రజల సమస్యలపై పోరుబాట వంటి అంశాలపై చర్చించనున్నారు. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సమస్య, పింఛన్ల కోత, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 సేవలకు అంతరాయం తదితర అంశాలపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని పటిష్టం చేయటం, ప్రజల పక్షాన పోరాడటమే తమ ముందున్న లక్ష్యాలనీ, పార్టీ శ్రేణులకు జగన్మోహన్రెడ్డి, ఇతర నేతలు దిశానిర్దేశం చేస్తారని పార్టీ ముఖ్య నేత కె.శివమాకుర్ విలేకరులకు చెప్పారు. -
'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయాలి'
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలకు సూచించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ అడ్‌హక్ కమిటీతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్ఆర్ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వైస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చేలా కృషిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాతో పాటు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.