
వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం.. పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కే శివకుమార్లను నియమించారు. ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి వ్యవహరిస్తారు. వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రహ్మాన్లను నియమించారు.
ఇటీవల జరిగిన వైఎస్ఆర్ సీపీ తెలంగాణ ముఖ్యనేతల విస్తృత సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలన్నింటినీ రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు, కమిటీలను నియమించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అప్పగిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.