
తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు.
ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కే శివకుమార్, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రహ్మాన్ లు బాధ్యతలు స్వీకరించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.