
చిత్రంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా తదితరులు
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్ : నీళ్లు, నిధు లు, ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని.. సర్కారు మోసాన్ని ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి కరీంనగర్ జిల్లా కేంద్రంగా శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నిరుద్యోగ గర్జన’ విజయవంతం అయ్యింది. కలెక్టరేట్ ప్రాంతం అంతా వైఎస్సార్ సీపీ జెండాలో కళకళలాడింది. యువకుల బైక్‌ర్యాలీ, కళాకారుల నృత్యాల మధ్య వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
దివంగత వైఎస్సార్ విగ్రహంతో సభవరకు ర్యాలీగా వెళ్లారు. సదస్సులో పలువురు నాయకులు, నేతలు తమ వాణిని వినిపించారు. ఉద్యోగాల సాధన కోసం ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో ప్రజలకు లబ్ధిచేకూర్చిన పథకాలు.. పాలనపై కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment