
'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయాలి'
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలకు సూచించారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలకు సూచించారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ అడ్‌హక్ కమిటీతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్‌ఆర్ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వైస్‌ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చేలా కృషిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాతో పాటు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.