- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి
- వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్
మంకమ్మతోట : అకాలవర్షాలు, వడగళ్లవానతో పంటలు నష్టపోయి బలన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్ కోరారు. సోమవారం కరీంనగర్ వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పరామర్శించకపోవడం రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ చర్యలు లేకపోవడంతో రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతులను ఆదుకోవడంతోపాటు పశు సంపదను రక్షించుకునేందుకు పశుగ్రాసం సరఫరా చేయూలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన చెరువుల పూడికతీత గొప్ప కార్యక్రమని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయూలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్‌ప్లాట్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ప్రారంభించాలని కోరారు. వార్డు సభ్యులకు సైతం గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. చిన్న చిన్నవాటిపై అతిగా స్పందిస్తున్న చంద్రబాబు టీడీపీ హయాంలో అసలు చేసిందేమి లేదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా చంద్రబాబు చెప్పుకుంటున్న టీడీపీ రానున్న రోజుల్లో కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎన్‌కౌంటర్ పేరిట చంద్రబాబు కూలీలను పొట్టపెట్టుకున్నారని, అది చాలక హత్యలు చేయిస్తూ రక్తపిశాసిలా మారారని ఆరోపించారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలను ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి సహాయ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి జైపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు మోకెనపెల్లి రాజమ్మ, బోగె పద్మ, కాసారపు కిరణ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా అధికార ప్రతినిధి గండి శ్యామ్, సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, హలీమొద్దీన్ ఫాహద్ సోనూ పాల్గొన్నారు.
రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియూ ఇవ్వాలి
Published Tue, May 5 2015 12:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement