
సాక్షి, తిరుపతి : తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇంటికి రావాల్సిందిగా కోరడంతో కేసీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లారు. వేదమంత్రాలు, సన్నాయి మేళంతో సాంప్రదాయబద్దంగా కేసీఆర్ దంపతులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత కేసీఆర్.. రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకు ముందు ఈ ఉదయం కేసీఆర్ కుటుంబసభ్యులు ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్‌కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment