
వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విస్తరణ
* మతీన్ అహ్మద్, గాదె నిరంజన్‌రెడ్డి
* సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా విజయచందర్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని శుక్రవారం విస్తరించారు. ఈ మేరకు తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జాబితా విడుదల చేశారు. పార్టీ తెలంగాణ కార్యవర్గం విస్తరణలో భాగంగా... ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్), మతీన్ అహ్మద్ ముజదాది (హైదరాబాద్), గాదె నిరంజన్‌రెడ్డి (నల్లగొండ) నియమితులయ్యారు. కార్యదర్శులుగా ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సయ్యద్ ఉద్దీన్ ముఖ్తార్ (నిజామాబాద్), ఎ.పద్మారెడ్డి (రంగారెడ్డి), జి.శ్రీధర్‌రెడ్డి (మెదక్), తుమ్మలపల్లి భాస్కర్ , వేముల శేఖర్‌రెడ్డి (నల్లగొండ), అక్కనపల్లి కుమార్ (కరీంనగర్), కె.పాండురంగాచార్యులు, పాకలపాటి చందు (ఖమ్మం), ఎం.ప్రభు కుమార్ (రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్) నియామకం అయ్యారు. ఇక సంయుక్త కార్యదర్శులుగా.. ధనలక్ష్మి (రంగారెడ్డి), బి.హనుమంతు (మహబూబ్‌నగర్), కె.సుదీప్‌రెడ్డి (నిజామాబాద్), మహమూద్ (హైదరాబాద్), జేవీఎస్ చౌదరి (ఖమ్మం), పిట్టా రామిరెడ్డి, ఎన్.స్వామి, ఎండీ సలీమ్ (నల్లగొండ), కె.నగేష్ (కరీంనగర్), బి.శ్రీనివాసరెడ్డి (రంగారెడ్డి)లను నియమించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కొండల్‌రెడ్డి, బి.సంజీవరావు (మెదక్), బి.బ్రహ్మానందరెడ్డి (రంగారెడ్డి), బెజ్జం శ్రీనివాసరెడ్డి (ఖమ్మం) నియమితులయ్యారు.
సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా విజయచందర్
పార్టీ తెలంగాణ కమిటీ సాంస్కృతిక, ప్రచార విభాగం అధ్యక్షుడిగా సినీ నటుడు టీఎస్ విజయచందర్ (హైదరాబాద్) నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఎస్.నరేష్, సుంకరపల్లి జగతి (కరీంనగర్), కార్యదర్శిగా చెరుకు శ్రీనివాస్ (రంగారెడ్డి), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా భీమ శ్రీధర్ (ఖమ్మం), రాష్ట్ర సేవాదళ్, వలంటీర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నీలం రమేశ్ (నిజామాబాద్), రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నయీం ఖురేషీ (ఖమ్మం), రాష్ట్ర డాక్టర్స్ విభాగం కార్యదర్శిగా డా.డోరేపల్లి శ్వేత (ఖమ్మం), రైతు విభాగం కార్యదర్శిగా యు.లక్ష్మీరెడ్డి(ఖమ్మం), రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కె.రామాచారి (ఖమ్మం) నియమితులయ్యారు. హైదరాబాద్ నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కొండా సాయికిరణ్‌గౌడ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ అర్షద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.రామేశ్వరీ శ్యామల నియమితులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బి.అనిల్‌కుమార్, నల్లగొండ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఐల వెంకన్నగౌడ్‌లను నియమించారు.
జిల్లాల పరిశీలకులు, సహ పరిశీలకులు..
రంగారెడ్డి పార్టీ పరిశీలకుడిగా కె.శివకుమార్, సహ పరిశీలకులుగా వడ్లోజుల వెంకటేష్, పి.రామిరెడ్డి. వరంగల్ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, సహ పరిశీలకులుగా ఆకుల మూర్తి, జి.శ్రీధర్‌రెడ్డి. నల్లగొండ పరిశీలకుడిగా ఎడ్మ కిష్టారెడ్డి, సహ పరిశీలకులుగా షర్మిలా సంపత్, ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి. మెదక్ పరిశీలకుడిగా మతీన్ అహ్మద్, సహ పరిశీలకులుగా ఎ.పద్మారెడ్డి, జి.రాం భూపాల్‌రెడ్డి. హైదరాబాద్ పరిశీలకుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సహ పరిశీలకులుగా తుమ్మలపల్లి భాస్కర్, సయ్యద్ ఉద్దీన్ ముఖ్తార్. ఆదిలాబాద్ పరిశీలకుడిగా ఎం.భగవంత్‌రెడ్డి, సహ పరిశీలకులుగా విలియం మునగాల, బి.శ్రీనివాసరావు.
కరీంనగర్ పరిశీలకుడిగా నల్లా సూర్యప్రకాష్, సహ పరిశీలకులుగా జి.జైపాల్‌రెడ్డి, కె.వెంకటరెడ్డి. నిజామాబాద్ పరిశీలకుడిగా గాదె నిరంజన్‌రెడ్డి, సహ పరిశీ లకులుగా కె.ఉపేంద్రరెడ్డి, అక్కెనపల్లి కుమార్. ఖమ్మం జిల్లా పరిశీలకుడిగా సత్యం శ్రీరంగం, సహ పరిశీలకులుగా వై.మహిపాల్‌రెడ్డి, జి.సూర్యనారాయణరెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ పరిశీలకుడిగా గున్నం నాగిరెడ్డి, సహ పరిశీలకులుగా కె.సుదీప్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి.