* పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపైనే ప్రధాన చర్చ
* హాజరు కానున్న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* వేదిక మెహిదీపట్నం క్రిస్టల్ గార్డెన్స్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి విస్తృత స్థాయి సమావేశానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్ (పిల్లర్ నెంబర్ 86)లో జరిగే ముఖ్య నాయకుల సమావేశానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేయటం, తెలంగాణ ప్రజల సమస్యలపై పోరుబాట వంటి అంశాలపై చర్చించనున్నారు.
రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సమస్య, పింఛన్ల కోత, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 సేవలకు అంతరాయం తదితర అంశాలపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని పటిష్టం చేయటం, ప్రజల పక్షాన పోరాడటమే తమ ముందున్న లక్ష్యాలనీ, పార్టీ శ్రేణులకు జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర నేతలు దిశానిర్దేశం చేస్తారని పార్టీ ముఖ్య నేత కె.శివమాకుర్ విలేకరులకు చెప్పారు.
నేడు వైఎస్సార్‌సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం
Published Wed, Oct 8 2014 12:42 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement