సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలోని ఆయా ప్రాజెక్టుల ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’(డీపీఆర్)లను ఈనెల 10లోగా ఇవ్వా లని గోదావరి బోర్డు ఆదేశించినా తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికే బోర్డు పెట్టిన గడువు ముగిసినా ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించలేదు. ఈ నెల 5న జరిగిన బోర్డు భేటీలో గోదావరి బేసిన్ పరిధిలో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈనెల 10 వరకు బోర్డు గడువు పెట్టినా డీపీఆర్‌లు సమర్పించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ సైతం సీరియస్‌గానే ఉంది. అన్ని ప్రాజె క్టుల డీపీఆర్‌లు తీసుకోవాలని రెండ్రోజుల కిందట నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి షెకావత్ సైతం బోర్డులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు మరోమారు లేఖలు రాయాలని నిర్ణయించినట్లు గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment