సాక్షి, న్యూఢిల్లీ: ఉభయ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో 2015 మే 6 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే కొనసాగుతున్నారని, రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయవాది సర్సాని సత్యంరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ జ్యోత్‌సేన్ గుప్తా 2015 మే 6న పదవీ విరమణ చేసిన తర్వాత రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తులను నియమించలేదని, అప్పట్నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులనే నియమిస్తూ వచ్చారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా కేవలం 27 మంది న్యాయమూర్తులే ఉన్నారని, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు 10 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment