సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ–21లో ప్రయోగాత్మ కంగా చేపడుతున్న పైప్‌లైన్ వ్యవస్థకు ఎట్టకే లకు టెండర్ పడింది. పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు ఈ అక్టోబర్‌లో నీటి పారుదల శాఖ అనుమతులివ్వగా, ప్రస్తుతం టెండర్లు పిలి చారు. మొత్తంగా రూ. 2,465 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించారు.
టెండ ర్లు వేసేందుకు ఈ నెల 29 వరకు గడువు విధించారు. ఈ కాళేశ్వరం ప్యాకేజీ–21ని గతంలో రూ.1,143.78 కోట్లతో 1.70 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా చేపట్టారు. ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. గరిష్టంగా భూ సేకరణకే రూ. 320 కోట్లు అవసరమవు తోంది. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదని, నీటి వృథాను నివారించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం పైప్‌లైన్ వ్యవస్థకు ఓకే చేప్పింది.
పైప్‌లైన్‌తో మరో లక్ష ఎకరాలకు నీరు
పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని నీటి పారుదల శాఖ తేల్చింది. ఈ మేరకు ఆయ కట్టు లేకపోవడంతో కొండం చెరువు, మంచి ప్ప చెరువును కలిపి 3.5 టీఎంసీల రిజర్వా యర్‌ను నిర్మించి అదనంగా లక్ష ఎకరాలకు నీరందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాటు చేసే పైప్‌లైన్ వ్యవస్థకు రూ. 2,248 కోట్లు ఖర్చవుతుండగా, ఇక 3.50 టీఎంసీల రిజర్వాయర్‌కు మరో రూ. 375 కోట్లు కలిపి రూ. 2,623 కోట్లకు అక్టోబర్‌లో ఆమోదం తెలిపారు. ఇందులో వ్యాట్, ఇతర ట్యాక్స్ లను తొలగించిన అనంతరం కేవలం పనుల విలువను రూ. 2,465 కోట్లుగా తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment