మహబూబ్‌నగర్(తలకొండపల్లి) : పదో తరగతి విద్యార్థి చలిజ్వరంతో మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం సూర్యాతండాలో చోటుచేసుకుంది. వెల్దండ మండలం కేస్లీతండాకు చెందిన రవితేజ(15) తలకొండపల్లి మండలం గట్టిప్పలిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో పదోతరగతి చదువుతున్నాడు.
కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తలకొండపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పరీక్ష రాసి సూర్యాతండాలో ఉన్న అక్క ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాక చలిజ్వరంతో తనువు చాలించాడు.
చలిజ్వరంతో విద్యార్థి మృతి
Published Thu, Mar 26 2015 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM
Advertisement
Advertisement