తండాల్లో అగ్ని ప్రమాదాలు
భారీ ఆస్తి నష్టంరూ. లక్షా 65 వేల నగదు..లబోదిబోమన్న బాధితులు
రామాయంపేట : మండలంలోని రాంపూర్, జడ్చెరువు తండాల్లో శనివారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదాల్లో నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలు, నిత్యవసర సరుకులు, దుస్తులు ఆహుతయ్యాయి. రాంపూర్‌లో లంబాడి గణేశ్, తన భార్యతో కలిసి నివాస గుడిసెకు తాళంవేసి చెరకు నరకడానికి వెళ్లాడు. సాయంత్రం ప్రమాదవశాత్తు ఇంట్లోనుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న రూ. లక్షా 60 వేలు నగదుతోపాటు మూడు క్వింటాళ్ల బియ్యం, మూడు తులాల బంగారు, వెండి ఆభరణాలు, కూలర్, వంట సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన గ్రామస్థులు మంటలను చల్లార్చడానికి ప్రయత్నించగా, సాధ్యం కాలేదు. ఈ ప్రమాదంలో గుడిసె పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఆర్‌ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలాన్ని సందర్శించి నష్టం వివరాలు నమోదు చేసుకున్నారు.
జడ్చెరువు తండాలో...
జడ్చెరువు తండాలో శనివారం లంబాడి శంకర్ అనే వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. వంట సామగ్రితోపాటు దుస్తులు, కొంత నగుదు, బంగారు వెండి ఆభరణాలు బుగ్గి అయ్యాయి. శంకర్ తన ఇం టికి తాళంవేసి భార్యతోపాటు పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.