ఆ బిడ్డ చనిపోయాడు..
- కాలిన గాయాలతో బిడ్డకు జన్మనిచ్చిన ఘటనలో..
- ఇంకా ఆస్పత్రిలోనే బాలింత
- కొడుకు లేడన్న విషయం చెప్పని కుటుంబ సభ్యులు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): నిండు గర్భిణిపై ఓ కిరాతక భర్త కిరోసిన్ పోసి నిప్పంటించినా కాలిన గాయాలతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బర్నింగ్ వార్డులో తల్లి.. చిల్డ్రన్స్‌వార్డులో చిన్నారి ఉన్నారు. ఐదు రోజుల తర్వాత సోమవారం ఆ శిశువు చనిపోయింది. నిజామాబాద్ శివారులోని నిజాంకాలనీకి చెందిన షేక్ ముజీబ్ అద నపు కట్నం కోసం భార్య సనాబేగంను వేధించి.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఈ నెల 18న ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. సనా బేగం కాలిన గాయాలతోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిం ది. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడు తోంది. ఎనిమిదో నెలలో శిశువు జన్మించ టంతో వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందించారు.
శిశువు ఐదు రోజుల పాటు క్షేమంగానే ఉండి ఒక్కసారిగా కడుపు ఉబ్బి మృతి చెందింది. కాగా, సనా బేగంకు తన కొడుకు చనిపోయాడన్న విషయం తెలియదు. రెండు రోజుల క్రితం తన కొడుకును ఒకసారి చూడాలని ఉందని తల్లిదండ్రులను వేడుకోవటంతో సెల్‌ఫోన్‌లో బాబు ఫొటో తీసి చూపించారు. బిడ్డను ఫొటోలో చూసుకొని మురిసి పోయిన ఆ తల్లి ‘తాను బతకనని.. బిడ్డను తన భర్తకే అప్పగిం చాలి’ అని చెప్పింది. సోమవారం సైతం బిడ్డను చూడాలని సనా బేగం కోరగా ప్రత్యేక వార్డులో ఉన్నందున తీసుకురాలేక పోతున్నా మని తల్లిదండ్రులు చెప్పి సము దాయించా రు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆమెకు.. బిడ్డ చనిపోయాడని చెబితే ఏం జరుగుతుందోనని చెప్పడం లేదు.