
లబ్ధిదారులకు భూ, పింఛన్ పంపిణీ
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌మైదానంలోని ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలువురు....
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌మైదానంలోని ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలువురు లబ్ధిదారులకు గురువారం మంత్రి రామన్న ఆస్తులను పంపిణీ చేశారు. వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగ విద్యావంతులకు ఒకొక్కరికీ రూ. 25000 చొప్పున రూ. 2 లక్షల 50 వేల విలువ చేసే 10 ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఐదుగురికి ఒక్కొక్కటి రూ. 6900 చొప్పున రూ. 34.500 విలువ చేసే ట్రైసైకిళ్లను, ఇద్దరికి రూ. 7వేల విలువచేసే రెండు వీల్‌చైర్‌లను అందించారు. ఇద్దరికి రూ. 2400 విలువ చేసే క్రచ్చర్స్‌ను అందించారు. ఐదుగురికి రూ. 10350 చొప్పున మొత్తం 51,750 విలువ చేసే ఆస్తులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 3లక్షల 52 వేల 650 విలువ చేసే ఆస్తులను పంపిణీ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 మందికి రూ. 14 లక్షల విలువ చేసే డీజిల్ ఆటోలను పంపిణీ చేశారు. ఐటీడీఏ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 91 మంది యువతకు రూ. 15 కోట్ల 54 లక్షలతో 91 ఆటోరిక్షాలను రాష్ట్ర మంత్రి జోగురామన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. హర్టికల్చరల్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 2 కోట్ల 60 లక్షల ఆస్థులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి రామన్న, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జడ్పీ చైర్‌పర్సన్ శోభరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ, ఎస్పీ విక్రజిత్ దుగ్గల్ అధికారులు పాల్గొన్నారు.
దళితబస్తీ భూమి పట్టాల పంపిణీ
జిల్లాలోని పలు గ్రామాల దళిత లబ్ధిదారులకు గురువారం 590.23 ఎకరాల భూమి పట్టాలను రాష్ట్ర మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. రూ.24 కోట్ల 42 లక్షల 679 విలువ గల భూమిని 205 మందికి దళిత బస్తీ కింద 590.23 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్‌రెడ్డి, ఎస్పీ విక్రజిత్ దుగ్గల్, జెడ్పీ చైర్‌పర్సన్ శోభరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ, తదితరులు పాల్గొన్నారు.
ఆర్మీ జవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ విశాఖ సంతోశ్ విధి నిర్వహణలో గత డిసెంబర్‌లో సియాచిన్‌లో మృతి చెందాడు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో రాష్ట్ర మంత్రి జోగు రామన్న సంతోశ్ కుటుంబసభ్యులకు పూల మాలలు వేసి శాలువాతో సన్మానించారు. ప్రభుత్వం తరుపున రూ. 25 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. సంతోష్ తమ్ముడు వెంకటేష్‌కు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, జెడ్పీ చైర్‌పర్సన్ భోభరాణిలు ఉన్నారు.