కేసీఆర్ పాలనపై ‘దగా పడుతున్న తెలంగాణ’
త్వరలో పుస్తకం రాస్తా..
ప్రజా తెలంగాణ కన్వీనర్ గాదె ఇన్నయ్య
పెద్దపల్లి : ‘ఆంధ్రపాలనలో దగాపడ్డ తెలంగాణ’ పుస్తకాలు రాసిన తాను కేసీఆర్ పాలనలో ‘దగా పడుతున్న తెలంగాణ’ పుస్తకాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రజా తెలంగాణ కన్వీనర్ గాదె ఇన్నయ్య తెలపారు. పెద్దపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోట్లాది మంది కలలుగన్న తెలంగాణ కొద్ది మంది కలల స్వప్నంగా మిగిలిపోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు లక్షల సింగరేణి ఉద్యోగా లు వస్తాయని, వారసత్వ ఉద్యోగనియామకాలు ఉం టాయని కేసీఆర్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశా రు. ఓపెన్ కాస్ట్ బొందల గడ్డను నిలిపేసి అండర్ గ్రౌం డ్ మైన్లను ఏర్పాటు చేస్తామని, తుంపర్ల సేద్యానికి స్వస్తి పలికి తూముల సేద్యం వస్తుందని.. ఇలా ఎన్నో ఆశలు రేపిన కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని దగా చేస్తున్నారన్నారు. ఉద్యమంలో ట్రాన్స్‌కో ఉద్యోగు లను ఏకం చేసి జేఏసీ కన్వీనర్‌గా పనిచేసిన రఘు ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందంలో లొసుగులపై మాట్లాడినందుకు గాను వరంగల్ జిల్లాలో ప్రాధాన్యతలేని సబ్‌స్టేషన్లకు బదిలీ చేశారని పేర్కొన్నారు.
ఉద్యమకారుడి గా ఎంతో చరిత్ర కలిగిన రఘును చూసి ఆంధ్రపాలకు లు భయపడ్డారనిఅయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అణచివేతకు గురయ్యారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి భారీగా నీళ్లుఆంధ్రాప్రాంతానికితరలిపోయాయన్నారు. హుజూ రాబాద్‌లో లైట్లు బిగించే కాంట్రాక్టు పనులు ఆంధ్రాప్రాంతానికి చెందినవారికివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం మన వాళ్లు లైట్లు బిగించే పనికి అక్కరకురారా అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో ప్రజాతెలంగాణ రాష్ట్రకో-కన్వీనర్ పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, తెలం గాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, డొంకెన రవి,రాజిరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.