‘గైనిక్’ లేరని వెళ్లగొట్టారు | The doctors managed to increase the promotion of the public hospitals | Sakshi
Sakshi News home page

‘గైనిక్’ లేరని వెళ్లగొట్టారు

Published Sun, May 4 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

The doctors managed to increase the promotion of the public hospitals

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కేసులు పెంచాలని ప్రచారం నిర్వహిస్తున్నా వైద్యులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులను జాగ్రత్తగా చూసుకుని వారికి కాన్పులు చేయాల్సి ఉండగా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వివిధ సాకులు చెప్పి ఆపరేషన్లు చేయకుండా తప్పించుకుంటున్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఉదంతమే అందుకు నిదర్శనం.
 
 మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్ : పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన మల్లేశం, చంద్రకళ దంపతుల కూతురు లలితను మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోగల కిష్టాపురానికి చెందిన కొండ మట్టయ్యకు ఇచ్చి ఆరేళ్ల కిత్రం వివాహం జరిపించారు. లలితకు నెలలు నిండటంతో శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి తీసుకురమ్మని చెప్పి పంపించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో లలితకు నొప్పులు అధికమై బ్లీడింగ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 3గంటల పాటు వేచి ఉన్నా వైద్యులు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. సంబంధిత డాక్టర్లు లేరని, నల్లగొండ లేదా నార్కట్‌పల్లికి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు.
 
 జ్యోతి ఆస్పత్రికి తరలింపు
 విషయం తెలుసుకున్న పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బత్తిని సోమిదేవి, టీఆర్‌ఎస్ నాయకుడు విజయ్‌కుమార్‌లు పట్టణంలోని జ్యోతి ఆస్పత్రి వైద్యుడు మువ్వా రామారావు దగ్గరకు వెళ్లి గర్భిణి పరిస్థితిని వివరించారు.వెంటనే స్పందించిన సదరు డాక్టర్ లిలతకు ఆపరేషన్ చేయడానికి అంగీకరించడంతో ఆమెను అక్కడకు తరలించారు.  
 
 గైనిక్ సర్జన్ సెలవులో ఉన్నారు
 ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ నాయక్‌ను వివరణ కోరగా గైనిక్ సర్జన్ రెండురోజులు సెలవులో ఉండటంతో గర్భిణినీ ఆస్పత్రిలో చేర్చుకోలేదని చెప్పారు. లలితను అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలి స్తామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement