అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సింగభూపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సింగభూపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.