
నాలుగో తరగతి విద్యార్థికి ఓటుహక్కు
ముస్తాబాద్: సెస్ ఎన్నికల్లో ముస్తాబాద్‌కు చెందిన నాలుగో తరగతి విద్యార్థి కె.వరుణ్‌కు అధికారులు ఓటుహక్కు కల్పించారు. వరణ్ పేరుతో కరెంట్ కనెక్షన్ ఉండడంతో సెస్ అధికారులు ఓటరు జాబితాలో వరుణ్ పేరును చేర్చారు. 18 సంవత్సరాలు నిండిన వారికే ఓటు హక్కు కల్పించాలన్న స్పృహను అధికారులు కోల్పోయారు. వరుణ్ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అధికారులు అడ్డుకున్నారు. బాలుడు ఎలా ఓటేస్తారని నిలువరించారు. ఓటుహక్కు ఎలా కల్పించారని అక్కడున్న వారు ప్రశ్నించారు.