మందుల పేరిట మోసం | The name of the drug fraud | Sakshi
Sakshi News home page

మందుల పేరిట మోసం

Published Sun, Dec 28 2014 2:08 AM | Last Updated on Fri, May 25 2018 2:47 PM

The name of the drug fraud

వేములవాడ అర్బన్ : అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసరా చేసుకుంటున్న కొన్ని మందుల కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. అందినకాడికి దండుకుంటున్నాయి. ఓ ఆయుర్వేద మందుల కంపెనీవారు చందుర్తి మండలం రుద్రంగి, నిజామాబాద్ జిల్లా మానాల గ్రామాలకు చెందిన 15 మందిని బురిడీ కొట్టించిన వైనం శనివారం వెలుగు చూసింది. బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన రాజేశ్ వీపీ డెలివరీ పేరుతో నడుస్తున్న ఆయుర్వేద కంపెనీకి రూ. 500 డీడీ చెల్లిస్తే కావాల్సిన మందులు పోస్టుద్వారా పంపిస్తామని ప్రకటనల ద్వారా నమ్మబలికాడు.

పార్శిల్ అందిన తర్వాత మరో రూ. 500 చెల్లించాలని సూచించాడు. దీంతో చందుర్తి మండలం రుద్రంగికి చెందిన దయ్యాల హన్మండ్లు, కాదాసు నారాయణ రూ. 500 డీడీ తీసి పంపారు. మరో 500 రూపాలు చెల్లించి పార్శిలు తీసుకున్నారు. పార్శిల్‌లో ఒకదానిని తెరిచి చూడగా అందులో చిత్తుకాగితాలు దర్శనమిచ్చాయి.

అవాక్కైన వారు మరో పార్శిల్ తీసుకునేందుకు నిరాకరించారు. తమ వద్దనున్న సెల్‌ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేస్తే సరైన స్పందన రాకపోవడంతో మోసపోయామని నాలుక్కర్చుకున్నారు. హన్మండ్లు, నారాయణలతోపాటు మరో 13 మంది సైతం రూ. 500 చొప్పున డీడీలు పంపించినట్లు చెప్పారు. విచ్ఛలవిడిగా వెలుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని సామాన్యులను రక్షించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement