గట్టు మండలం రాయపురం గ్రామంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ షాక్‌కు గురై ఓ వ్యక్తి చనిపోయాడు.
గట్టు మండలం రాయపురం గ్రామంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ షాక్‌కు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన నల్లారెడ్డి గురువారం ఉదయం తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు ఛార్జి పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య శివమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.