టూరిస్టులే దేవతలు: పేర్వారం | The tourists are gods to us | Sakshi
Sakshi News home page

టూరిస్టులే దేవతలు: పేర్వారం

Published Mon, Aug 29 2016 7:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

టూరిస్టులే దేవతలు: పేర్వారం - Sakshi

టూరిస్టులే దేవతలు: పేర్వారం

తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకి టూరిస్టులే దేవతలని మాజీ డీజీపీ, టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. సోమవారం ఎల్‌బీ స్టేడియంలో టీఎస్‌టీడీసీ రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ పేరుతో వివిధ రకాల ఆటపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టంబర్ 26న సరిగ్గా రెండేళ్ల క్రితం టీఎస్‌టీడీసీ ఆవిర్భించిందన్నారు. కేవలం 60 లక్షలు మాత్రమే టూరిస్టుల సందర్శన ఉండగా, టీఎస్‌టీడీసీ కొత్త కొత్త టూరిస్టు ప్రాంతాలను అభివృద్ధి చేయగా ఈ ఏడాది కోటీ పదహారు లక్షల మంది టూరిస్టు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సందర్శించారన్నారు. చైనాతో సంబంధ బంధవ్యాలను పెంచుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన క్యాథపెస్‌విక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది 1200 మంది చైనా వాసులు తెలంగాణలోని బౌద్ద క్షేత్రాలను సందర్శించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement