ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు శివారులోని లింగంపల్లి వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మిస్తుండగా గ్రామస్తులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. స్కూలు సమీపంలో టవర్ నిర్మాణం వల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల టవర్‌ను మరోచోట నిర్మించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.