గత ప్రభుత్వాలు వేసవిలో కరెంటు కోతలు విధించేవని, పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ వేసవిలో విద్యుత్ కోతలు విధించరాదని నిర్ణరుుంచిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మం డలం జిల్లెల్లలో రూ.40 లక్షలతో చెరువు పునరుద్ధరణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అర్హులైన బీడీ కార్మికులకు భృతి అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. సమగ్ర సర్వేలో చాలామంది తప్పుడు సమాచారం ఇవ్వడం మూలంగా ఇలాంటి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు.
వేసవిలో కరెంటు కోతలు ఉండవు: కేటీఆర్
Published Wed, Apr 1 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement