సాక్షి. జనగామ: ముదిరాజ్‌ల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లతో 38 రకాల సౌకర్యాలను కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేం ద్రంలో బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహిం చారు. జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఈటల ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రోకర్ల పాత్రను తగ్గించి మత్స్యకారులు లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ముదిరాజ్‌లకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను సరఫరా చేస్తామని, రుణాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేపల పెంపకంలో బ్రోకర్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో మత్స్యకారుల సంక్షేమంపై అధ్యయనం చేశామని గుర్తు చేశారు. మత్స్యకారుడు ఏ కారణంతో చనిపోయినా రూ.6 లక్షల బీమా ఇస్తామని హామీ ఇచ్చారు. చెరువులపై రైతులు, ముదిరాజ్‌లు, రజకులకు హక్కులు కల్పించేవిధంగా జీవోను జారీ చేస్తామని తెలిపారు. బండా ప్రకాశ్‌కు వ్యక్తిగతంగా రాజ్యసభ సీటు రాలేదని, ముదిరాజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే కేసీఆర్ సీటు కేటాయించారన్నారు.
వైఎస్ చొరవతో ముదిరాజ్‌లను బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)లో చేర్చారని, ఏడాదిపాటు రిజర్వేషన్లు అనుభవించామని, ముదిరాజ్‌లలో ఐక్యత లేకపోవడంతో రిజర్వేషన్లు నీరుగారిపోయాయని విచా రం వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. హరితహారం, మిషన్ కాకతీయతో ముదిరాజ్ లకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎంపీ లు బండా ప్రకాష్, నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, రాజయ్య, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment