టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఆటో, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు నుంచి టేకులపల్లి వైపు వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రసన్న, మల్లయ్య, కిషన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.