సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరో జాతీయ పురస్కారం దక్కింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచినందుకు మిషన్ భగీరథకు జాతీయ జల మిషన్ అవార్డు ప్రకటించింది. దీంతోపాటే సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు (టీఎస్‌డబ్ల్యూఐఆర్‌ఎస్), భూగర్భజలాలు ప్రమాదకర స్థితికి చేరిన ప్రాంతాల పునరుజ్జీవానికి ప్రత్యేక దృష్టి పెట్టినందుకు రాష్ట్ర భూగర్భజల విభాగానికి అవార్డులు దక్కాయి. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment