పండగపూట విషాదం | Three people died in road accidents | Sakshi
Sakshi News home page

పండగపూట విషాదం

Published Sat, Mar 7 2015 12:25 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

పండగపూట విషాదం - Sakshi

పండగపూట విషాదం

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
పలువురికి గాయాలు
పెద్దవూర, దేవరకొండ, చివ్వెంల మండలాల్లో ఘటనలు

 
 పెద్దవూర: రంగుల పండగ హోలీ అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపితే కొందరి ఇళ్లలో మాత్రం పెను విషాదాన్నే నింపింది.. జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో   ఇద్దరు మృత్యువాత పడగా, మరికొందరు తీవ్ర గాయాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.పెద్దవూర, చివ్వెంల, దేవరకొండ మండలాల పరిధిలో శుక్రవారం  చోటు చేసుకున్న ప్రమాదాల వివరాలు.. పెద్దవూర మం డలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త జయరాంతండాకు చెందిన వడ్త్య బాలు- నాను దంపతుల చిన్న కుమారుడు వడ్త్య హరిలాల్(19)శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లొస్తానని బైక్‌పై వెళ్లాడు.

అదే తండాకు చెందిన తన సమీప బంధువు స్నేహితుడైన నున్సావత్ సర్ధార్‌ను వెంట తీసుకుని ఇద్దరూ కలిసి సౌండ్ బాక్స్‌లను కొనుగోలు చేసి తీసుకువద్దామని బైక్‌పై హాలియాకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను మండలంలోని చింతపల్లి స్టేజీ వద్ద ఏఎమ్మార్పీ లోలెవల్ వరద కాలువపైకి రాగానే కోదాడ నుంచి కర్నూలుకు వెళ్తున్న కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ను నడుపుతున్న హరిలాల్, వెనుక కూర్చున్న సర్ధార్‌లు అంతెత్తు పైకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడ్డారు. హరిలాల్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, సర్ధార్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా ఢీ కొట్టడంతో మృతుడు హరిలాల్ తల ఛిద్రమై అతడు పెట్టుకున్న టోపీలో మెదడు ముద్దలా పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సర్ధార్ పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
 
మరో 15 రోజుల్లో పెళ్లి..


పది రోజుల క్రితం అనుముల మండలం నేతాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుమీదితండాకు చెందిన యువతితో మృతుడు హరిలాల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి పత్రికలు పంపిణీ చేయటానికి గాను కట్నం కింద కాబోయే వధువు తల్లిదండ్రులు బైక్‌ను ఇప్పించారు. పెళ్లి కూడా ఉగాది పండగ తర్వాత జరపటానికి నిశ్చయించుకున్నారు. అదే బైక్‌పై హాలియాకు వెళ్తూ మృత్యువాత పడ్డాడు.

మిన్నంటిన రోదనలు

ప్రమాద విషయాన్ని మృతుడు సెల్‌ఫోన్ ఆధారంగా పోలీ సులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సం ఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యు లు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. పెళ్లిబాజాలు మోగించాల్సిన ఇంట చావుబాజా మోగిస్తావా దేవుడా అంటూ వారు రోదించిన తీరు అందరినీ  కంట తడి పెట్టించాయి. ఇంట్లో నుంచి వెళ్లిన అరగంటలోనే శవమై కనిపించటంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ప్రమాదానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సర్ధార్‌కు 10 నెలల క్రితమే వివాహమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.ప్రసాదరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement