టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ ఏపీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని, దీంతో ఉద్యోగుల కేటాయింపుల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరుతూ శనివారం దేవీప్రసాద్ నేతృత్వంలో టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్, మరికొంతమంది సచివాలయంలో కమలనాథన్ కమిటీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానికతను పక్కన పెట్టి తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఆప్షన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను నింపుతున్నారని ఆరోపించారు. స్థానికతపై స్పష్టమైన నిర్ధారణకు రాకుండానే ఉద్యోగుల కేటాయింపును చేపట్టడం శోచనీయమన్నారు.