వరంగల్ సిటీ : వారం రోజుల సెలవుల అనంతరం సోమవారం నుంచి వరంగల్ ఏనుమా ముల మార్కెట్ ప్రారంభం కానుంది. పత్తి సీజ న్ ప్రారంభమవుతున్నందున పెద్ద ఎత్తున పత్తి తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. వేల సంఖ్య లో బస్తాల పత్తి రానున్నందున రైతులకు ఎ లాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు పూర్తిచేయించడం అధికారులకు కత్తి మీద సామేనని చెప్పాలి.
కొత్త కార్యదర్శి విధుల్లో చేరేనా?
వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మా ర్కెట్ కార్యదర్శిగా నియమితులైన అజ్మీరా రాజునాయక్ ఇక్కడ విధుల్లో చేరేందుకు అనాసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా భైంసా మార్కెట్ కార్యదర్శి అజ్మీరా రాజునాయక్‌ను వరంగల్‌కు బదిలీ చేసింది. అయితే, ఆసియాలోనే రెండో అతి పెద్దదైన వరంగల్ మార్కెట్‌ను పరిపాలనాపరంగా నడిపించడంలో ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో రాజునాయక్ ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
అంతేకాకుండా వరంగల్‌లో ఖరీ దుదారుల కంటే అడ్తివ్యవస్థ బలంగా ఉన్న కా రణంగా కార్యదర్శిగా విధులు నిర్వర్తించడం కష్టంతో కూడుకున్న పని అని ఆయన ఇతరుల తో మాట్లాడిన సందర్భంలో తెలుసుకున్న ట్లు చెబుతున్నారు. దీంతో తన బదిలీ స్థానాన్ని మార్పించుకునేందుకు రాజునాయక్ ప్రయత్నిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, రాజునాయక్ ఇక్కడకు రాని పక్షంలో గతంలో వరంగల్ మార్కెట్ కార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి వరంగల్‌కు బదిలీ చేయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచా రం.
అయితే, ఒకవేళ రాజునాయక్ విధుల్లో చేరినా వెంటనే భారీగా రానున్న పత్తి కొను గో ళ్లపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఇక్కడ పత్తి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడడం కత్తి మీద సామేనని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒకటి, రెం డు రోజుల్లో ఉప్పుల శ్రీనివాస్ విధుల నుంచి రిలీవ్ అయితే.. రాజునాయక్ చేరతారా, లేదా అనేది తేలనుంది.
నేడు మార్కెట్ పునఃప్రారంభం
Published Mon, Oct 27 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement