రూ. 5 వేలు పలికిన పత్తి ధర
- బేళ్లు, గింజలకు పెరిగిన డిమాండ్
- మరింత పెరిగే అవకాశం!
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్‌కు రూ.5వేలు పలికింది. తొమ్మిదినెలల క్రితం పత్తి క్వింటాల్‌కు రూ.4850 వరకు వచ్చింది. తాజాగా మంగళవారం వరంగల్ మార్కెట్‌కు 5992 బస్తాల పత్తి రాగా క్వింటాల్‌కు రూ.5వేలు పలికింది.
అయితే పత్తి సీజన్ పూర్తిగా అయిపోరుుంది. పెట్టుబడుల కోసం రైతులు కొన్ని బస్తాలను మాత్రమే ఇంటివద్ద నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం పత్తి ధర రూ.5వేలు పలికినా పెద్దగా లాభపడేది లేదని పత్తి రైతులు వాపోతున్నారు. ఇప్పటికే 95 శాతం రైతులు పత్తిని అమ్ముకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్‌కు రూ.43,500 ధర పలుకుతున్నదని, గింజలు క్వింటాల్‌కు రూ.1770 ధర పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపారుు. బేళ్లు, గింజల ధర మరికొద్దిగా పెరిగే అవకాశం ఉందని, పత్తి ధర సైతం మరో 500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా పత్తి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.5వేలు పలకడం ఇదే మొదటిసారి.