
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు తగ్గిన టమాట దిగుమతులు..మరోవైపు పెరుగుతున్న ధరలు నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండుతున్న ఎండలతో పాటు నగరంలో కూరగాయల ధరలు కూడా వేడిపుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా టమాట.. రోజు రోజుకూ పెరుగుతున్న టమాటా ధరలతో నగరవాసి కుదేలవుతున్నాడు. టమాటా తిందామంటే ఆలోచించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతు బజారులోనే కిలో 70 రూపాయలు పలుకుతున్న టమాటా, ఇక బహిరంగ మర్కెట్‌లో రూ. 80 నుంచి రూ. 90 పలుకుతోంది. దాదాపు ప్రతి కూరలో వినియోగించే టమాట తినాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టమాట దిగుమతులు నగర హోల్‌సేల్ మార్కెట్‌కు భారీగా తగ్గాయి.గత ఏడాది నగర మార్కెట్లకు 250 టన్నులు దిగుమతయ్యేవి. అయితే ప్రస్తుతం కేవలం 100 టన్నుల టమాట మాత్రమే దిగుమతవుతోంది. మార్చి, ఏప్రిల్ నెల వరకు శివారు గ్రామాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి టమాట దిగుమతులు ఉండేవి. ప్రస్తుతం శివారు జిల్లాల నుంచి దిగుమతులు త గ్గాయి దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టమాటపైన నగర ప్రజల అవసరాలు తీరుతున్నాయి.
నగరానికి 332 టన్నుల టమాట
ప్రసుత్తం టమాట అన్ సీజన్ కావడంతో నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట్, మీరాలం మండితో పాటు రైతుబజార్లకు వివిధ జిల్లాల నుంచి రోజు 100 టన్నుల టామట దిగుమతి అవుతుంది. నగర టమాట అవసరాలు తీర్చాడానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తున్నారు. దీంతో ట్రాన్స్‌పోర్టు ఖర్చులు పెరగడం డిమాండుకు సరిపడా కాకుండా తక్కువ సరఫరా కావడం కూడా కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
జాడలేని ప్రత్యామ్నాయం..
సీజన్‌లో టమాట ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అన్‌సీజ్‌లో ధరలు నిలకడగా ఉంచడానికి మార్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. గత మూడు నెలల క్రితం రంగారెడ్డి, మెదక్‌తో పాటు మదనపల్లి నుంచి నగరానికి అవసరానికి కంటే ఎక్కువ టమాట దిగుమతి అయింది. అదే సీజన్‌లో న గరానికి రోజుకు 280–300 టన్నుల టమాట సరిపొతుందని మార్కెటింగ్ అధికారుల అంచనాల. అయితే సీజన్‌లో ఎక్కువ మొత్తం దిగుమతి అవుతున్న టమాటను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టి అన్ సీజన్‌లో ధరలు నియత్రించాడానికి మార్కెటింగ్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు.
పచ్చి మిర్చిదీ అదే బాట
నగర ప్రజల పచ్చి మిర్చి అవసరాలు తీర్చాడానికి శివారు ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి అవుతుంది. అయితే ఇటీవల అకాల వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో మిర్చి సరఫరా తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరానికి మిర్చి సరఫరా తగ్గింది. నగరానికి రోజు దాదాపు 1200 నుంచి 1500 క్వింటాళ్ల వసరం ఉంది. మంగళవారం నగరానికి కేవలం 850 క్విటాళ్ల మిర్చి మాత్రమే వివిధ హోల్‌సేల్ మార్కెట్‌లకు దిగుమతి అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో మిర్చి క్వింటాల్ ధర రూ. 5 వేల నుంచి 6 వేలు పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment