హైదరాబాద్ : గ్రామాల్లో పనిచేసే ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందని వైద్యసంఘాల సభ్యులు చెప్పారు. శిక్షణకు విధి విధానాలను ఖరారు చేయడానికి సోమవారం సచివాలయంలో కమ్యూనిటీ పారా మెడికల్ కార్యదర్శి కుమార్ అధ్యక్షతన, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.
గతంలో శిక్షణ ఇచ్చిన వైద్యులకు సర్టిఫికెట్‌లు జారీ చేయాలని, ఇప్పటివరకు కమ్యూనిటీ పారా మెడికల్ బోర్డులో నమోదు చేసుకున్న 24 వేల మందికి శిక్షణ ఇవ్వాలని కోరామని వైద్య సంఘాల సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. ఇందుకు అవసరమ్యే నిధులను మంజూరు చేసినందుకు ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వి.రావు, అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, పట్టణ, గ్రామీణ వైద్యుల ఐక్య వేదిక అధ్యక్షుడు బాలబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ
Published Mon, Jul 6 2015 8:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement