మూడేళ్ల క్రితం గిరిజన విద్యార్థిని మరణానికి సంబంధించిన సమాచారాన్ని కమిషనర్ దృష్టికి తీసుకురానందుకు డిప్యూటీ ....
హైదరాబాద్: మూడేళ్ల క్రితం గిరిజన విద్యార్థిని మరణానికి సంబంధించిన సమాచారాన్ని కమిషనర్ దృష్టికి తీసుకురానందుకు డిప్యూటీ డెరైక్టర్ (డీడీ)పై అభియోగాలను నమోదు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. 2012 ఆగస్టు 28న ఖమ్మం జిల్లా భద్రాచలంలోని వీర్‌పురం మండలంలోని కుడులూరులోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని పూణెం లక్ష్మీ మృతి చెందింది.
ఈ సమాచారాన్ని నాడు గిరిజన శాఖ కమిషనర్ దృష్టికి తీసుకురానందుకు ఐటీడీఏ, భద్రాచలం డిప్యూటీ డెరైక్టర్ (గిరిజన సంక్షేమం) ఎం.సరస్వతిపై అభియోగాలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై 15 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని గిరిజన శాఖ కార్యదర్శి జీడీ అరుణ ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు.