Deputy Director
-
మాజీ డ్రైవరే హంతకుడు
బనశంకరి: బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన గనులు, భూవిజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ (40) హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. చామరాజనగర జిల్లా మహదేశ్వరబెట్టలో దాగిన అతన్ని బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీసులు గాలించి నిర్బంధించారు. ఉద్యోగం నుంచి తీసేశారనే ద్వేషంతో ఆమె మాజీ కారుడ్రైవరు కిరణ్ ఈ హత్యకు పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద సోమవారం తెలిపారు. కిరణ్ (32) స్వస్థలం బెంగళూరు కోణనకుంటె. కొన్ని సంవత్సరాలుగా ప్రతిమ ఆఫీస్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల కిందట ఒక యాక్సిడెంట్ చేయడంతో పాటు అక్రమ గనులపై దాడుల సమాచారం ముందుగానే గనుల యజమానులకు లీక్ చేసేవాడు. దీంతో ప్రతిమ అతడిని 10 రోజుల కిందటే ఉద్యోగం నుంచి తీసేయించారు. -
గనుల శాఖ మహిళా అధికారి హత్య
బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు. కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు. -
ప్రముఖ క్రీడాకారులు.. డిప్యూటీ డైరెక్టర్లుగా నియామకం
చంఢీగడ్ : భారత రెజ్లర్ బబితా ఫోగాట్, కబడ్డీ క్రీడాకారిణి కవితా దేవిలను క్రీడా, యువజన వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లుగా నియమిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 జూలై 29న వెలువడ్డ ఉత్తర్వులకు అథ్లెట్లు ఇద్దరూ దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ చోటుకల్పించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెలరోజుల్లోగా ఇద్దరు అథ్లెట్లు సంబంధిత విభాగంలో రిపోర్టు చేయాలని తెలిపారు. ప్రసిద్ధ రెజ్లింగ్ కోచ్ మహావీర్ ఫోగాట్ కుమార్తె బబితా. ఫోగట్ సోదరీమణుల జీవితం ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ చిత్రం దంగల్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫోగాట్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగి పోయింది. (వారికి సాయం చేయండి: విరుష్క) కొత్త బాధ్యతలను చేపట్టడంపై బబితా స్పందిస్తూ.. తన నియామకంపై సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, క్రీడల మంత్రి సందీప్ సింగ్‌లకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఒక క్రీడాకారిణిగా ఆటగాళ్లకు అవసరమైన అన్ని సదుపాయాలు లభించేలా కృషి చేస్తానని తెలిపింది. ఒక ప్రశ్నకు సమాధానంగా భారత మాజీ హాకీ జట్టు కెప్టెన్ క్రీడా మంత్రి సందీప్ సింగ్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొంంది. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బబితా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ప్రముక కబడ్డీ క్రీడాకారిణి కవితాదేవి 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించింది. (జాతీయ క్రీడా అవార్డులు ఆలస్యం! ) खेल विभाग हरियाणा में उप निदेशक पद पर नियुक्त करने के लिए हरियाणा के माननीय मुख्यमंत्री @mlkhattar जी,माननीय राज्यसभा सांसद एवं हरियाणा के प्रभारी @aniljaindr जी,माननीय खेल मंत्री @flickersingh जी,प्रदेश अध्यक्ष @OPDhankar जी,संगठन महामंत्री @sureshbhattbjp जी का बहुत बहुत आभार। pic.twitter.com/59rxq5EKtr — Babita Phogat (@BabitaPhogat) July 30, 2020 -
అర్హుల లిస్ట్ అమ్ముకున్నాడు
సాక్షి, హైదరాబాద్ : ఆటగాళ్ల భవిష్యత్తుతో ఆడుకున్నారు. అర్హుల జాబితాను అమ్ముకున్నారు. మెడిసిన్ సీట్లలో స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్‌లకు వెలకట్టారు. క్రీడాకారులకు, వారి సంబంధీకులకు వీటిని అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (శాట్స్) డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటరమణ లంచం డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం వెంకటరమణను అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయంతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లోని శాట్స్ సంబంధీకుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ ప్రయారిటీ లిస్టులు, సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జారీ చేయట్లేదని శాట్స్ ఏ అండ్ ఎస్ఎస్ ఇన్చార్జ్ కె.మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ (సీ అండ్ ఏ) జీఏ శోభ, అడ్మినిస్ట్రేటర్లు జి.చంద్రారెడ్డి, విలమలాకర్రావులపై ఆరోపణలు రావడంతో వారి ఇళ్ళల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం అవసరమైన ప్రయారిటీ లిస్టులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏ ఆట క్రీడాకారుడికి ఎంత ర్యాంక్ వస్తే, ఏ కోర్సులో సీటు వచ్చే ఆస్కారం ఉందనేది ఈ జాబితాల్లో ఉంటుంది. మెడిసిన్ ప్రవేశపరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారులు నిత్యం శాట్స్ నుంచి ఈ జాబితాలు తీసుకుంటారు. అందులోని ప్రయారిటీ ప్రకారం తమకు మెడిసిన్‌లో స్పోర్ట్స్ కోటాలో సీటు రాదని భావిస్తే మరో కోటాలో దరఖాస్తు చేసుకుంటుంటారు. దీన్నే కొందరు శాట్స్ అధికారులు క్యాష్ చేసుకోవడం ప్రారంభించారు. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రయారిటీ లిస్ట్ జారీకి డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారనేది ఆరోపణ. క్రీడాకారులైన భరత్ చంద్రారెడ్డి , వర్షితా రాజ్‌ల ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు పొందడానికి అవసరమైన ప్రయారిటీల జారీలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవి జరగట్లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిపై ప్రాథమిక విచారణ చేస్తున్న ఏసీబీకి భరత్‌చంద్రారెడ్డి తండ్రి సత్యనారాయణ నుంచి గత నెల 25న మరో ఫిర్యాదు అందింది. ఇందులో తనకు స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్ జారీ చేయడానికి వెంకటరమణ గతేడాది ఆగస్టులో రూ.లక్ష లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగి లోతుగా ఆరా తీసింది. మొత్తం 9 మంది సభ్యులు గల కమిటీ ఈ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసినప్పటికీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణది కీలక పాత్రగా ఏసీబీ పేర్కొంది. మొత్తం ఎంత మంది నుంచి ఈ మొత్తం వసూలు చేశారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ జాబితాల తయారీలోనూ అవకతవకలు జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. వెంకటరమణతో పాటు కమిటీ సభ్యులైన మనోహర్, శోభ, గుర్రం చంద్రారెడ్డి, విమలాకర్రావులపై ఈ ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హబ్సిగూడ రవీంద్రనగర్‌లోని వెంకటరమణ, శోభ ఇళ్లల్లో సోదాలు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతినగర్ కాలనీలో నివసించే చంద్రారెడ్డి, బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ–2లో గల డి.విమలాకర్రావు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈయన కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ కమిటీ సభ్యుల కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. అక్కడి వెంకటరమణ, శోభల చాంబర్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన వెంకటరమణను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రజల వద్ద ఏవైనా ఫిర్యాదులు, ఆధారాలు ఉంటే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు. -
స్విమ్స్ టెండర్లలో మాయాజాలం
-
స్విమ్స్ టెండర్లలో మాయాజాలం
స్విమ్స్ టెండర్లలో మాయాజాలం చక్రం తిప్పుతున్న డిప్యూటీ డెరైక్టర్లు బంధుగణ ప్రయోజనాలే లక్ష్యం టీడీపీ, బీజేపీ పెద్దలదే తెరవెనుక మంత్రాంగం తిరుపతి: ప్రస్తుతం స్విమ్స్‌లో చర్చనీయాంశం గా మారిన టెండర్ల రద్దు వ్యవహారంలో ఇద్దరు డిప్యూటీ డెరైక్టర్లదే కీలక మంత్రాంగమని తెలుస్తోంది. అధికార పార్టీ పెద్దల ఆశీ స్సులు పుష్కలంగా ఉన్న వీరిద్ధరి నిర్ణయాలకు ఎదురు చెప్పే ధైర్యం లేక టెండరు కమిటీల్లోని మిగతా సభ్యులు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. తాజాగా చోటుచేసుకున్న పరి ణామాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతోంది. స్విమ్స్‌లో శానిటేషన్, పారామెడికల్, సెక్యూరిటీ, నాన్‌పారా మెడికల్ ఉద్యోగుల సరఫరా కోసం అక్టోబరు 6న పిలిచిన రూ.1.65 కోట్ల టెండరును అదే నెల 28న తెరిచారు. ఇందులో ఎల్-1గా నిలిచిన చైతన్యజ్యోతి సొసైటీకి వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన తరుణంలో టెండర్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారికంగా బయటికి వచ్చిన కారణాలు ఏమైనప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ డెరైక్టర్లు బంధుప్రీతితో టెండర్ల రద్దుకు చక్రం తిప్పారని తెలుస్తోంది. అధికార పార్టీ లోని కొందరు మంత్రులు, వారి వద్ద పనిచేసే వ్యక్తులు ఇందులో తలో చేయి వేశారు. దీంతో నాలుగోసారి టెండర్లు రద్దయ్యాయి. టెండర్లను ర ద్దు చేసిన స్విమ్స్ డెరైక్టర్ ఉన్నపళంగా అమెరికా పయనమై వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది. బాధ్యతల నుంచి వైదొలిగిన ఇద్దరు అధికారులు టెండర్ల రద్దు వ్యవహారం తెరమీదకు రావడంతో గురువారం సాయంత్రం వేర్వేరు బాధ్యతల్లో ఉన్న ఇద్దరు స్వి మ్స్ అధికారులు బాధ్యతల నుంచి త ప్పుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి రిజిస్ట్రార్ వాసుదేవరెడ్డి, మెడికల్ కా లేజీ ప్రిన్సిపల్ హనుమంతరావు స్వ చ్ఛందంగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా డాక్టర్ కళావత్ను కూడా నియమించినట్లు తెల్సింది. టెండరు కమిటీలో సభ్యుడైన వాసుదేవరెడ్డి టెండర్లపరంగా జరుగుతున్న అనధికార నిర్ణయాలను, స్విమ్స్‌లో జరిగే కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ పక్కకు తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆరా... స్విమ్స్ టెండర్లు నాలుగోసారి రద్దయిన వ్యవహారంపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీసినట్లు తెల్సింది. ఎవరెవరు బిడ్లు వేశారు, టెండర్లు ఎవరికి దక్కాయన్న వివరాలతో తాజా వ్యవహారాలపై మంత్రి కామినేని శ్రీనివాస్‌తో మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తనకు దక్కాల్సిన టెండర్లను అన్యాయంగా రద్దు చేశారని చైతన్యజ్యోతి సొసైటీ అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, సభ్యుడు నాగార్జునరెడ్డిలు చేసిన ఫిర్యాదును సీఎం పేషీ స్వీకరించింది. 2016-6098560 నెంబరు కింద ఫిర్యాదును స్వీకరించి విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని చిత్తూరు కలెక్టర్‌కు సూచించినట్లు తెల్సింది. -
ఆరు విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు!
* ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ప్రతిపాదన * నష్టపోయిన రైతులకు రూ.20 వేల నుంచి రూ.40 వేల పరిహారం * నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక విత్తన చట్టం తేవాలని సూచన * విత్తన కంపెనీల యజమానులు పరారీ... * కాపాడాలంటూ ప్రజాప్రతినిధులను కలుస్తున్న డీలర్లు! సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టిన ఆరు విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు పరిహారంగా చెల్లించాలని కోరనుంది. ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్త సైదయ్య, ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధు సహా పలువురి బృందం మూడు రోజుల పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించి.. పలు కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినట్లు నిర్ధారించింది. దీనిపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మం గళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథికి అందజేయనుంది. ఖమ్మం జిల్లాలో జీవా అగ్రి జెనిటిక్స్ లిమిటెడ్‌కు చెందిన జేసీహెచ్-801 విత్తనాలను, గ్రీన్ ఎరా కంపెనీకి చెందిన సీఎస్-333 విత్తనాలను రైతులకు అంటగట్టారు. వరంగల్ జిల్లాలో జీవాతోపాటు ఆగ్రో జెనిసీడ్, క్రాప్ జెనిటిక్స్కు చెంది న బేలా-2205, క్యామ్‌సన్ సీడ్స్ లిమిటెడ్‌కు చెందిన పెన్నార్, లక్కీ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన అంజనీ, మహా నంది కంపెనీకి చెందిన మహాతేజ మిరప విత్తనాలను విక్రయించారు. ఈ విత్తనాల్లో సగానికిపైగా నకిలీ విత్తనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం తేల్చిం ది. నకిలీ విత్తన న మూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపి, పూర్తి వివరాలను తేల్చనున్నారు. భారీగా నష్టం.. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంత మంది రైతులు నష్టపోయారనే అంశాలను జిల్లా కలెక్టర్లు నిర్ధారిస్తారని శాస్త్రవేత్తల బృందం నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నష్టపోయిన రైతులు మిరప విత్తనాలు, సాగు కోసం ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారని.. ఈ మేరకు పరిహారం చెల్లించాలని సూచించినట్లు సమాచారం. దీనిని కంపెనీల నుంచే వసూలు చేయాలని.. నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్లనూ బాధ్యులను చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక నకిలీ విత్తనాలు విక్రయించే వారికి కఠిన జైలుశిక్ష, జరిమానాలు విధించేలా విత్తన చట్టాన్ని తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వమే పరిశోధన, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని చేపట్టాలని, హైబ్రిడ్ కాకుండా సూటి రకాలను తయారుచేసి రైతులకు అందజేయాలని... విత్తనాలపై రైతులను చైతన్యం చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. అడ్రస్‌లన్నీ నకిలీవే.. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలన్నీ కూడా నకిలీ అడ్రస్‌లు ఇచ్చి లెసైన్సులు పొందాయి. ఆయా చిరునామాల్లో అధికారులు దాడులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఇలా అడ్రస్ లేకుండా నడిపించే విత్తన కంపెనీలకు ఎలా లెసైన్సులు ఇచ్చారనేది తేలడం లేదు. లంచం తీసుకుని లెసైన్సులు ఇస్తున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నకిలీ విత్తనాల బాగోతం బయటపడడంతో కొన్ని కంపెనీల యజమానులు, కొందరు డీలర్లు పరారీలో ఉన్నారు. కొందరు కంపెనీ ప్రతినిధులు, డీలర్లు ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి తమను ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వ్యవసాయశాఖకు చెందిన కొందరు అధికారులను కూడా వారు కలిసి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
గిరిజన సంక్షేమం?
సీతంపేట : ఐటీడీఏలో ప్రాజెక్టు అధికారి (పీఓ) తర్వాత అత్యంత కీలకమైన విభాగాధిపతి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్. ఈ పోస్టు భర్తీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది. రాష్ట్రంలో అన్ని ఐటీడీఏలకు డీడీ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అయినప్పటికీ సీతంపేటలో మాత్రం మూడేళ్లుగా భర్తీ చేయకుండా ప్రభుత్వం వదిలేసింది. కేవలం ఇన్‌చార్జిలతోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం ఇక్కడ డీడీగా పని చేసిన సర్వేశ్వరరెడ్డికి ఐటీడీఏ పీఓగా పదోన్నతి లభించడంతో ఆయన నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓగా పని చేసిన కొమరం నాగోరావు కొంతకాలం వరకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన తెలంగాణకు బదిలీ కావడంతో వంశధార ఎస్డీసీ సుదర్శనదొరను ఇన్చార్జిగా నియమించారు. ఆయనకు విజయవాడ సీఆర్డీఏకు బదిలీ కావడంతో ఏడాదిన్నర కిందట డిప్యూటీడీఎంఅండ్హెచ్ఓగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నాయిక్కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. ఇదీ పరిస్థితి... ఐటీడీఏ పరిధిలో 25 గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 16 ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఏడు వసతిగృహాలు, 13 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు, 4 గురుకుల పాఠశాలలు, 3 కేజీబీవీలు, రెండు మినీగురుకులాలు ఉన్నారుు. ఇందులో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి సంక్షేమాన్ని పర్యవేక్షించా ల్సి ఉంది. అలాగే విద్యార్థుల మౌలిక వసతుల స్థితిగతులు చూడాల్సిన బాధ్యత ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేపథ్యం, మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయా లు కూడా డీడీయే పర్యవేక్షించాల్సి ఉం ది. సంక్షేమశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చే యాల్సి ఉంది. ఎన్టీఆర్ విద్యాజ్యోతి, అంబేడ్కర్ విద్యానిధి, గిరిపుత్రిక కల్యాణం, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థు ల ఉపకార వేతనాల ఆన్లైన్ చేయడం వంటి కార్యక్రమాలు పక్కాగా పర్యవేక్షించాల్సి ఉంది. వైద్యశాఖలో కీలక బాద్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ డీడీగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇటు వైద్యశాఖ, అటు విద్యాశాఖ రెండు బాధ్యతలు పర్యవేక్షణతో ఆయన కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. 271 జీఓ ప్రకారం ఐటీడీఏ పీఓకు అన్ని శాఖలను నియంత్రించే అధికారం ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయి డీడీ లేకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించే పాఠశాలలను ఐటీడీఏ పీఓ ఆకస్మికంగా తనిఖీ చేయడం, చర్యలకు ఉపక్రమించడం, హెచ్ఎం, వార్డెన్లు, హానరోరియం డెరైక్టర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పీఓ కూడా 15 శాఖల వరకు పర్యవేక్షించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ శాఖపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారే తప్ప మిగతా శాఖలపై ఎటువంటి చర్యలు లేవనే విమర్శలున్నాయి. ఇటీవల కొత్త డీడీగా రంపచోడవరంలో గతంలో పనిచేసిన గ్రూప్ వన్ అధికారి మల్లికార్జునరావును నియమించారు. అయితే ఆయన కూడా ఇక్కడ జాయిన్ కాలేదు. ఈయన రాకను కూడా కొంతమంది కీలక నేతలు, అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. -
సర్వే టెస్ట్‌కు మంగళం.. సెలవు రోజు ఇంటర్వ్యూ
ఏలూరు (టూ టౌన్) :సర్వేయర్ లెసైన్స్‌లు జారీ చేసేందుకు జిల్లా సర్వే, భూమి రికార్డుల విభాగం అధికారులు భారీగా సొమ్ములు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అభ్యర్థులకు సర్వే అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించకపోవడంతోపాటు సెలవు రోజున ఇంట ర్వ్యూలు నిర్వహించడం ఇందుకు ఊతమిస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన 22 మంది హైదరాబాద్‌లోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో 6 వారాల పాటు శిక్షణ పొందారు. వీరికి సర్వే, భూ రికార్డుల విభాగం డెప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ ఆధ్వర్యంలో అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లెసైన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. అలా లెసైన్స్ పొందిన వారు ప్రైవేటు సర్వేయర్లుగా భూముల్ని సర్వే చేయడానికి అర్హత పొందుతారు. అయితే, శిక్షణ పొందిన 22 మంది అభ్యర్థులను శుక్రవారం ఏలూరులోని సర్వే, భూమి రికార్డుల కార్యాలయానికి పిలిపించారు. వారికి అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించకుండా.. కేవలం ఇంటర్వ్యూలతో సరిపెట్టారు. అదికూడా 40 నిమిషాల్లో పూర్తిచేశారు. సర్వేయర్ లెసైన్స్ కావాలంటే కొంత సొమ్ము ముట్టజెప్పాలని అభ్యర్థులపై అధికారులు ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులైన సదరు అభ్యర్థులంతా సర్వేయర్ లెసైన్స్ వస్తే తమకు పని దొరుకుతుందన్న ఉద్దేశంతో సొమ్ములిచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా, గురువారం నాడు అసెస్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉం డగా, ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన కమిటీ వెంట వెళ్లాల్సి వచ్చిందన్నారు. అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సెలవు రోజైనా విధులకు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించామని చెప్పారు. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదన్నారు. ఆలస్యం అవుతుందనే.. సర్వే ట్రైనింగ్ పూర్తయిన అభ్యర్థులకు ఎప్పుటికప్పుడు లెసైన్సులు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. గురువా రం ఇంటర్వ్యూలు నిర్వహించాలను కున్నాం. వీలు కాలేదు. అందుకే సెలవు రోజున ఇంటర్వ్యూలు చేశాం. - పీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ డెరైక్టర్, సర్వే విభాగం వసూళ్లకు పాల్పడితే చర్యలు సర్వే లెసైన్సుల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెలవు రోజైనా ఇంటర్వ్యూ నిర్వహించాం. అభ్యర్థులంతా సర్వే అకాడమీలో శిక్షణ పొందిన దృష్ట్యా అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించలేదు. - సీహెచ్‌వీ సుబ్బారావు, డెప్యూటీ డెరైక్టర్, సర్వే విభాగం -
గిరిజన బాలిక మృతిపై డీడీపై అభియోగాల నమోదు
హైదరాబాద్: మూడేళ్ల క్రితం గిరిజన విద్యార్థిని మరణానికి సంబంధించిన సమాచారాన్ని కమిషనర్ దృష్టికి తీసుకురానందుకు డిప్యూటీ డెరైక్టర్ (డీడీ)పై అభియోగాలను నమోదు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. 2012 ఆగస్టు 28న ఖమ్మం జిల్లా భద్రాచలంలోని వీర్‌పురం మండలంలోని కుడులూరులోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని పూణెం లక్ష్మీ మృతి చెందింది. ఈ సమాచారాన్ని నాడు గిరిజన శాఖ కమిషనర్ దృష్టికి తీసుకురానందుకు ఐటీడీఏ, భద్రాచలం డిప్యూటీ డెరైక్టర్ (గిరిజన సంక్షేమం) ఎం.సరస్వతిపై అభియోగాలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై 15 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని గిరిజన శాఖ కార్యదర్శి జీడీ అరుణ ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కీలక పోస్టులు ఖాళీ
నల్లగొండ అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ శాఖలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో ప్రధాన పోస్టులైన డిప్యూటీ డెరైక్టర్ (ఆగ్రానమీ), డిప్యూటీ డెరైక్టర్( ప్లాంట్ ప్రొడక్షన్) పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా డీడీఏలతో పాటు ఒక ఏడీఏ (శిక్షణ)పోస్టు కూడా గత ఏడాదికాలంగా ఖాళీగా ఉంది. అధికారులు ఉద్యోగ విమరణ పొందిన నాటి నుంచి కొత్తగా అధికారుల నియామకం కాకపోవడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు పోస్టులకు ఏడీఏ(ఆగ్రానమీ)గా పనిచేస్తున్న అధికారిణి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంటాయి. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ, జాతీయ ఆహారభద్రత మిషన్, రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన తదితర సబ్సిడీ పథకాల ద్వారా కోట్లాది రూపాయలతో ఆయా ప్రభుత్వాలు ఆమలు చేస్తుంటాయి. జిల్లా వ్యవసాయ కార్యాలయం ద్వారా అమలయ్యే పథకాలను పై అధికారులు ఎప్పటికప్పుడ పర్యవేక్షణ చేస్తూ సకాలంలో అర్హులైన రైతులకు అందించేలా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మూడు ప్రధాన పోస్టులలో అధికారులు లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలుకు నోచుకోవడం కష్టమే మరి. వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ పథకాల అమలును పర్యవేక్షిస్తే, కార్యాలయంలోని డీడీఏలు,ఏడీఏలు కార్యాలయంలో రైతులకు అందుబాటు లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడంతో పాటు పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇంతటి ప్రధాన పోస్టులలో అధికారులు లేకపోవడం వల్ల ఖరీఫ్‌లో రైతులకు తిప్పలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో జేడీఏ బి.నర్సింహారావుతో పాటు ఏడీఏ సుభోదిని మాత్రమే ఉండడడం వల్ల వారికి పనిభారం బాగా పెరిగింది. ఖాళీలను భర్తీ చేయకపోతే ప్రస్తుత ఖరీఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి. ‘ఆత్మ’దీ అదే దారి జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ(ఆత్మ) కార్యాలయంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేసిన కె.హేమమహేశ్వర్రావు విభజనలో భా గంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడంతో పీడీ పో స్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా జేడీఏ బి.నర్సింహారావు వ్యవహరిస్తున్నారు. కాగా కార్యాలయంలోని రెండు డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టులు రెండేళ్లకుపైగా ఖాళీగా ఉన్నాయి. మూడు ప్రధాన పో స్టులు ఖాళీ ఉండడంతో రైతులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అందజేస్తారో అధికారులే చెప్పాలి. ఆత్మ ద్వారా పలు పథకాలను అమలు చేస్తుం టారు. రైతులకు వ్యవసాయ శాఖతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా వివిధ రకాల శిక్షణను , క్షేత్ర ప ర్యటనలు, అవగాహన సదస్సులు వీటితో పాటు నాగార్జునసాగర్ ఆధునికీకరణ పథకంలో భాగంగా పలు పథకాలను అమలు చేస్తూ రైతులకు ఆధునిక వ్యవసాయంపై పరిజ్ఞానాన్ని పెపొం దించే ఆత్మలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడం వలన రైతులకు ఇబ్బందులే మరి. వెంటనే ఆయా శాఖలలో ఖాళీపోస్టులను భర్తీ చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
సాక్షర భారత్‌లో గోల్మాల్!
లక్షల విలువైన నోట్‌బుక్కులు, పెన్సిళ్లు మాయం అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ చేతివాటం శిక్షణ పూర్తి కావస్తున్నా అందని మెటీరియల్ ఆలస్యమైన మాట వాస్తవమేనన్న డిప్యూటీ డెరైక్టర్ అందరికీ సరఫరా చేస్తామని వివరణ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సాక్షర భారత్ ఐదో దశ కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో వేలాది మంది వయోజనులకు అందాల్సిన నోట్‌బుక్కులు, పెన్సిళ్లు, షార్ప్నర్స్ను కూడా బొక్కేస్తున్నారు. మార్చి నెలలో పంపిణీ చేయాల్సిన ఆయా సామగ్రి నేటికీ సగం మండలాల్లో అందనేలేదు. మరో నెలరోజుల్లో ఐదో దశ శిక్షణా కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది. ఈ దశలో తూతూమంత్రంగా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులోనూ నాసిరకం సామగ్రిని పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ పంపిన సదరు మెటీరియల్‌లో చాలా మేరకు జిల్లా కేంద్రంలో మాయమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా నేటికీ కరీంనగర్ డివిజన్లోని వయోజనులకు మెటీరియల్ అందలేదని సమాచారం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఫలితంగా సాక్షరతా భారత్ లక్ష్యం నెరవేరకపోగా, ప్రభుత్వం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయల ప్రజాధనం నీళ్లపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదీ లక్ష్యం.. సాక్షర భారత్‌లోని ఐదవ దశ కార్యక్రమం జిల్లాలోని 1207 గ్రామ పంచాయతీల్లో జనవరిలో ప్రారంభమైంది. ఒక్కో గ్రామంలో 60 మంది చొ ప్పున జిల్లావ్యాప్తంగా 72,420 మంది వయోజనలకు ఈ కార్యక్రమం కింఙద చదవడం, రాయ డం, సంఖ్య పరిజ్ఞానంపై శిక్షణ అందించాలి. అందులో భాగంగా ఒక్కో వ్యక్తికి రాసుకునేందు కు నోట్‌బుక్, పెన్సిల్, షార్ప్‌నర్‌తో కూడిన కిట్ ను ఇవ్వాల్సి ఉంది. కిట్ల సరఫరా కోసం ఫిబ్రవరిలోనే టెండర్ పిలిచారు. ఒక్కో కిట్ ధర 27 రూపాయల 40 పైసల చొప్పున మొత్తం 19 లక్ష ల 84 వేల 308 రూపాయల వ్యయంతో 72,420 మందికి పంపిణీ చేసేందు కు వరంగల్‌కు చెందిన అంబికా ప్రింటర్స్ ముందుకు రావడంతో వారికి కేటాయించారు. ఒప్పందంలో భాగంగా మార్చి నాటికే జిల్లావ్యాప్తంగా అందరికీ కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ లక్ష్యం అనుకున్నట్లుగా నెరవేరితే జిల్లాలోని 72 వేల మందికి వయోజనులు అక్షరాస్యులవుతారు. కానీ ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మెటీరియల్ మాయమైందా? తక్కువ కిట్లు సరఫరా చేశారా? ఇంతవరకు బాగానే ఉన్నా... ఏప్రిల్ వరకు జిల్లాలో ఏ ఒక్క వయోజనుడికి నోట్‌బుక్, పెన్సిల్, షార్ప్‌నర్ కిట్ అందలేదని తెలుస్తోంది. దీనిపై ఆరా తీస్తే మే మొదటి వారంలోనే సదరు కాం ట్రాక్టర్ ఆయా సామగ్రిని కరీంనగర్‌కు పంపినట్లు తెలిసింది. జిల్లా వయోజన విద్యాశాఖ అధికారులు జిల్లా పరిషత్ క్వార్టర్స్‌లో ఆయా సామగ్రిని నిల్వ చేశారు. పక్షం రోజులు గా డివిజన్ల వారీగా సామగ్రిని వాహనాల్లో తరలించి గ్రామాలకు చేర్చే పనిలో నిమగ్నమయ్యా రు. అందులో భాగంగా కరీంనగర్ డివిజన్ పరిధిలోని మండలాలకు ఆయా వస్తువుల కిట్ల ను తీసుకెళ్లేందుకు సంబంధిత సిబ్బంది మంగళవారం జెడ్పీ క్వార్టర్‌కు వెళ్లారు. సరిపడా కిట్లు లేకపోవడంతో తిరుగుముఖం పట్టారు. ఆరా తీస్తే క్వార్టర్స్‌లో నిల్వ చేసిన కిట్లు మాయమైనట్లు తెలిసింది. తాళం ఉండగా ఎట్లా మాయం అయ్యాయనే అంశంపై చర్చ జరుగుతోంది. సద రు కాంట్రాక్టర్ సరిపడా మెటీరియల్ పంపలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలే నాసిరకం... ఆపై అంతా ఆలస్యం మరోవైపు సదరు కాంట్రాక్టర్ సరఫరా చేసిన నోట్‌బుక్కులు, పెన్సిళ్లు, షార్ప్నర్స్ నాసిరకమ నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటరాజ్ సంస్థకు చెందిన పెన్సిళ్లు, నోట్‌బుక్కులు పంపిణీ చేశామని చెబుతున్నా... అందులో క్వాలిటీ లేదనే విమర్శలు వస్తున్నా యి. దీనికితోడు సకాలంలో నోట్‌బుక్కులు పంపిణీ చేయకపోవడంతో ఈ కార్యక్రమం లక్ష్యమే నీరుగారి పోయినట్లయింది. మరో నెల రోజుల్లో శిక్షణ కార్యక్ర మం పూర్తి కాబోతుండగా... ఇప్పుడు నోట్‌బుక్కులు, పెన్సి ల్స్, షార్ప్నర్స్ ఇచ్చి ఉపయోగం ఏముందని వయోజనులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం నీళ్లపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆలస్యమైన మాట వాస్తవమే : సత్యనారాయణ, వయోజన విద్య డిప్యూటీ డెరైక్టర్ సాక్షర భారత్ ఐదో దశ మెటీరియల్ పంపిణీ కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. పదిహేను రోజుల క్రితమే పుస్తకాలొచ్చాయి. వాటిని జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీచేశాం. హుజూ రాబాద్ నియోజకవర్గంలోని మండలాలు మినహా జిల్లావ్యాప్తంగా అందరికీ మెటీరియల్ పంపిణీ చేశాం. జెడ్పీ క్వార్టర్స్‌లో నిల్వ చేసిన మెటీరియల్ మాయమైందనడంలో వాస్తవం లేదు. నాలుగైదు మండలాలకు సరిపడా మెటీరియల్ తక్కువ పడినట్లు సిబ్బంది చెబుతున్నరు. ఏదేమైనా అన్ని మండలాలకు తగిన మెటీరియల్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌దే. అందరికీ మెటీరియల్ అందకపోతే తగిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం మెటీరియల్ అనేది సరికాదు. నటరాజ్ సంస్థ పెన్సిళ్లనే పంపిణీ చేశాం. నోట్‌బుక్స్ నాణ్యతపై అనుమానాలొస్తే ల్యాబ్‌కు పంపాం. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. -
ఆఫీస్ లోనే ఉరేసుకున్న డిప్యూటీ డైరెక్టర్
అనంతపురం: సాక్షర భారత కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. విధులకు హాజరవుదామని వచ్చిన ఉద్యోగాలకు ఈశ్వరయ్య ఉరేసుకుని కన్పించడంతో వారంతా షాక్ కు గురైయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి బయల్దేరారు. -
ముతక అన్నం మసక వెలుతురు
vip రిపోర్టర్ ఎస్. మధుసూదనరావు డిప్యూటీ డెరైక్టర్, సాంఘిక సంక్షేమశాఖ తూర్పుగోదావరి చెట్టుకు కాయలు భారం కాకపోవచ్చేమో కానీ.. అనేక పేద కుటుంబాలకు పిల్లకాయల చదువు భారమే. అందుకే వారు బిడ్డలు దూరమైనా భరించి.. వారికి చదువు చేరువవుతుందని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో చేరుస్తారు. ఆ వసతి గృహాల్లో ఎన్నో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. కాకినాడలో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న గాంధీనగర్ మల్లయ్య అగ్రహారంలోని వసతిగృహం కూడా వాటిలో ఒకటి. బడుగు కుటుంబాలకు చెందిన 97 మంది విద్యార్థులు ఉంటున్న ఈ హాస్టల్ ఒక అద్దె భవనంలో నడుస్తోంది. ఇరుకుగా, పగలే మసక చీకటి పరుచున్నట్టుండే గదులు, ఇంకా ఎన్నో సమస్యలు.. వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ సంకల్పించింది. తోటలో ఎక్కడ ఏ లోపం ఉందో బయటి వారి కన్నా తోటమాలికి తెలిస్తేనే చక్కదిద్దడం తేలికవుతుంది. అందుకే ‘సాక్షి’ తన సంకల్పాన్ని సాకారం చేసే బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎస్.మధుసూదనరావుకే అప్పగించింది. ‘వీఐపీ రిపోర్టర్’గా ఆయనతో ఆ హాస్టల్ స్థితిగతులను ఆరా తీయించింది. రిపోర్టర్‌గా డీడీ ఆ కర్తవ్యాన్ని ఉత్సాహంగా, నిబద్ధతతో నిర్వర్తించారు. వసతిగృహంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. వారు చెప్పింది సావధానంగా విన్నారు. అనంతరం డీడీగా ఆ సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సమస్యనూ పరిష్కరిస్తా.. ‘వీఐపీ రిపోర్టర్’గా ‘సాక్షి’ అప్పగించిన బాధ్యతను పూర్తి చేసిన అనంతరం డీడీ మధుసూదనరావు విద్యార్థులతో ఏమన్నారంటే.. ‘సరిపడా వెలుతురు లేదని, సొంత భవనం కావాలని, ఫ్యాన్లు తిరగడం లేదని, బియ్యంలో రాళ్ళు వస్తున్నాయని, బాత్రూమ్లు బాగోలేవని.. ఇలా పలు సమస్యలు చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుతాను. తలకు దిండ్లు ప్రభుత్వం సమకూర్చడం లేదు. అయినా వాటిని సైతం ఇచ్చేలా ఉన్నతాధికారులకు తెలియపరుస్తాను. కాకినాడలో ఎకరం స్థలం కోసం అన్వేషిస్తాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాను. రూ.80 లక్షలతో వసతిగృహం నిర్మితమయ్యేలా చూస్తాను. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేస్తాను’ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు : బాబూ! నీపేరేంటి...ఎలా ఉన్నావ్? విద్యార్ధి: సర్ గుడ్ ఈవినింగ్, నా పేరు ఉడాల విమలరాజు. బాగున్నాను సర్. డీడీ : రాజూ! మధ్యాహ్నం స్నాక్స్ ఇచ్చారా.? రాజు: బిస్కట్స్ ఇచ్చారు సర్! డీడీ: మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోంది? మెనూలో, వసతిగృహంలో సమస్యలున్నాయా? రాజు: అన్నంలో రాళ్ళు వస్తున్నాయి. అన్నం కాస్త ముతకగా ఉంటుంది. మెనూ రోజూ సరిగానే ఇస్తున్నారు సర్. డీడీ: ఈ సమస్యను వార్డెన్ దృష్టికి తేలేదా? విద్యార్థులు: తెచ్చాం సర్..మార్పిస్తాం అన్నారు. డీడీ: నిన్న వసతిగృహంలో మెనూఏంటి? విద్యార్థులు : చికెన్ పెట్టారు సార్.. బాగుంది. డిడీ: హలో! స్మార్ట్‌బాయ్ నీపేరు? విద్యార్థి: (నవ్వుతూ) మురళీధర్ సర్ ! డీడీ: మురళీధర్! ఏం చదువుతున్నావ్? ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? మురళీధర్: 9వ తరగతి చదువుతున్నా..హాస్టల్ బాగానే ఉంది సార్. డీడీ: మీకు నిద్రపోయేందుకు కార్పెట్, బెడ్‌షీట్ ఇచ్చారా? దిండు లేదని అన్పించలేదా? మురళీధర్: ఇచ్చారు సార్.! దిండు బదులు పుస్తకాలు పెట్టుకుంటున్నాం. డీడీ: ఇక్కడ లైటింగ్ బాగుంటుందా, గదిలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు అన్నీ సవ్యంగా ఉన్నాయా ఫ్రెండ్స్? వెంకటేష్: ఫ్యాన్లు తిరగడం లేదు, లైటింగ్ లేదు సార్ డీడీ: మరి వార్డెన్‌కి చెప్పలేదా? మణికంఠ: చె ప్పాం సార్ సరిచేయిస్తానన్నారు..వారం రోజులైంది. డీడీ: (మరొక గదిలోకి అడుగుపెడుతూ) హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ? విద్యార్థులు: ఫైన్ సర్! వాట్ ఎబౌట్ యు సర్? డీడీ: ఫైన్, థాంక్యూ. నేనెవరో తెలుసా మీకు? విద్యార్థులు: తెలుసు సార్! మీరు మా డీడీగారు. డీడీ: ఇప్పుడు మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చిన ‘సాక్షి’ రిపోర్టర్ని. ఒక విద్యార్థి : బాత్రూంకి గడియలు లేవు సార్! డీడీ : బాబూ.. నీపేరు? ఏంచదువుతున్నావ్? విద్యార్ధి: సతీష్ కుమార్ . మాది కొడవలి. డీడీ: ఎన్నాళ్ళుగా ఉంటున్నావ్ ఇక్కడ? హాస్టల్ మీద నీ అభిప్రాయం! సతీష్‌కుమార్: రెండేళ్ళుగా ఉంటున్నాను సర్. అంతా బాగానే చూస్తున్నారు. డీడీ: (మరో గదిలోకి అడుగుపెడుతూ) దోమ తెరలు ఇచ్చారుగా వాడుతున్నారా స్టూడెంట్స్? విద్యార్థులు: వాడుతున్నాం సార్. డీడీ: బాబూ నీపేరేంటి? ఏం చదువుతున్నావ్? ఇక్కడ పరిస్థితుల గురించి చెప్పు. విద్యార్థి: నాపేరు మణికంఠ సార్.. 8వతరగతి చదువుతున్నా.. డీడీ: కాస్మోటిక్స్(సబ్బు ఇతర వస్తువులు) అందాయా నీకు? మణికంఠ: ఆగస్టు తర్వాత లేవు సర్. డీడీ: అవునా? మీ వార్డెన్ ప్రొవైడ్ చేశారుగా.. నీకు అందలేదా? మణికంఠ: అందలేదు సార్! డీడీ: వార్డెన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు.. ఎవరైనా చెప్తారా? రమేష్: (మైకు తీసుకుని) బుధవారం వార్డెన్ రారు సార్. మిగిలిన అన్ని రోజులూ ఉంటారు. డీడీ: ఆదివారం మీరంతా ఏం చేస్తారు? రమేష్: మేం చర్చికి వెళతాం సార్. కొందరు గుడికి వెళతారు. డీడీ: గుడ్..మీకు టీవీ ఉందా? వాడుతున్నారా? రమేష్: వాడుతున్నాం సార్. డీడీ: ఏం చూస్తారు? రమేష్: న్యూస్, పిక్చర్స్ చూస్తాం సార్. డీడీ: మీరు స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారా? దుర్గాప్రసాద్: పాల్గొన్నాం సార్. మా పాఠశాలలో స్వచ్ఛభారత్ దళం ఏర్పాటు చేశారు. అందులో నేను సభ్యున్ని సార్. డీడీ: గుడ్..ఆ కార్యక్రమాన్ని దేశంలో ఎవరు ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటి? దుర్గాప్రసాద్: మన ప్రధాని నరేంద్ర మోదీ సార్..మన శుభ్రత..పరిసరాల శుభ్రతే దీని ముఖ్య ఉద్దేశం సార్. డీడీ: బాబూ.. నీపేరేంటి? ఏం చదువుతున్నావ్? విద్యార్థి: నాపేరు ప్రసాద్ సర్.. నేను 9వతరగతి చదువుతున్నాను. డీడీ: ఇక్కడ సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నావా నీవు? ప్రసాద్: పడుకోడానికి ప్లేస్ సరిపోవడం లేదు సార్. డీడీ: గదిలో ఎంతమంది పడుకుంటున్నారు? ప్రసాద్: 8నుంచి 10మంది పడుకుంటాం సర్..కరెంటు పోతే ఉక్కపోతతో ఇబ్బందిగా ఉంది సార్. డీడీ: ఈ సమస్యను వార్డెన్ దృష్టికి తెచ్చారా? ప్రసాద్: ఆ..తెచ్చాం సార్..చేయిస్తానన్నారు..! డీడీ: ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రసాద్: మాకు చెప్పులు ఇవ్వలేదు సార్. స్విచ్ బోర్డులు సరిగా లేవు సార్. గదుల్లో వెలుతురు రాక చీకటిగా ఉంటోంది సార్. డీడీ: మరి ఎలా చదువుకుంటున్నారు? ఇబ్బందిగా లేదూ..లైట్లు ఉన్నాయిగా? ప్రసాద్ : చాలా ఇబ్బందిగా ఉంది సార్. లైట్లు ఉన్నా ఆ వెలుతురు సరిపోవడం లేదు. డీడీ: మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాను. డోంట్ వర్రీ. (ఇంకో విద్యార్థి దగ్గరికెళ్ళి) హలో బాగున్నావా.. నీపేరు? విద్యార్థి: బాగున్నాను సార్. నాపేరు సాయి వెంకటేష్. డీడీ: ఎన్నాళ్ళుగా ఉంటున్నావ్? సాయి వెంకటేష్: రెండేళ్ళుగా ఉంటున్నా సార్. డీడీ: ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పు వెంకటేష్. సాయివెంకటేష్: సర్..మాకు బాత్రూంలు సరిగా లేవు.ఆడుకోడానికి వసతి గృహానికి గ్రౌండ్ లేదు సార్. బయట వెలుతురున్నా గదుల్లో చీకటే సార్. డీడీ: ఓకే..ఫ్రెండ్స్ మీ సమస్యలన్నింటినీ ‘సాక్షి’ ద్వారా ప్రజల ముందుంచుతాం. (డీడీ గదిలోంచి వరండాలోకి వెళ్ళి బాత్ రూమ్‌లను, ఆవరణలోని మొక్కలను పరిశీలించారు.) డీడీ: విద్యార్థులూ.. ఈ మొక్కలు మీరే నాటారా? విద్యార్థులు : మేమే వేశాం సార్.. బయట ఎంట్రన్స్‌లో ఇంకా ఎక్కువ వేశాం. రండి చూపిస్తాం. (డీడీ ఉత్సాహంగా..మొక్కలు పరిశీలించి మొక్కల పేర్లను విద్యార్థులతో చెప్పించారు. విద్యార్థులు: బెండకాయలు, చిక్కుడు కాయలు కాయించాం సర్. తోటకూర, గోంగూర పండించాం సార్. డీడీ: (వార్డెన్‌ను ఉద్దేశించి) ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? వార్డెన్ ప్రసాద్‌బాబు : మూడేళ్లుగా పనిచేస్తున్నాను సర్. డీడీ: వసతి గృహంలో సమస్యలుంటే చెప్పండి! వార్డెన్: కొత్త భవనం సొంతంగా ఏర్పాటు చేయాలి. పగటి పూట కూడా చీకటిగా ఉంటోంది. ఆటస్థలం లేక దగ్గర్లో ఉన్న పార్కుకు వెళుతున్నారు. కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. డీడీ: కాస్మొటిక్ చార్జీలు ఎప్పటి నుంచి రావడం లేదు? వార్డెన్ : మూడు నెలలుగా రావడం లేదు. డీడీ : బడ్జెట్ వచ్చింది కదా.. వార్డెన్ : ఆగస్టు వరకే వచ్చింది,. ఆ తరువాత రాలేదు సర్. డీడీ : సరే ఏర్పాటు చేస్తాను. డీడీ : విద్యార్థులంతా మాసిన దుస్తులతోనే కనిపిస్తున్నారేంటి? వార్డెన్ : విద్యార్థులకు ఏకరూప దుస్తులే నాలుగు జతలు ఇచ్చారు. సివిల్ డ్రెస్ కూడా ఇస్తే బాగుంటుంది సర్! ప్రజెంటేషన్ :లక్కింశెట్టి శ్రీనివాసరావు, మల్లిపూడి శివసాయిప్రసాద్ ఫొటోలు :గరగ ప్రసాద్