లక్షల విలువైన నోట్‌బుక్కులు, పెన్సిళ్లు మాయం
అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ చేతివాటం
శిక్షణ పూర్తి కావస్తున్నా అందని మెటీరియల్
ఆలస్యమైన మాట వాస్తవమేనన్న డిప్యూటీ డెరైక్టర్
అందరికీ సరఫరా చేస్తామని వివరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సాక్షర భారత్ ఐదో దశ కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో వేలాది మంది వయోజనులకు అందాల్సిన నోట్‌బుక్కులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్స్‌ను కూడా బొక్కేస్తున్నారు. మార్చి నెలలో పంపిణీ చేయాల్సిన ఆయా సామగ్రి నేటికీ సగం మండలాల్లో అందనేలేదు. మరో నెలరోజుల్లో ఐదో దశ శిక్షణా కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది. ఈ దశలో తూతూమంత్రంగా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
అందులోనూ నాసిరకం సామగ్రిని పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ పంపిన సదరు మెటీరియల్‌లో చాలా మేరకు జిల్లా కేంద్రంలో మాయమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా నేటికీ కరీంనగర్ డివిజన్‌లోని వయోజనులకు మెటీరియల్ అందలేదని సమాచారం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఫలితంగా సాక్షరతా భారత్ లక్ష్యం నెరవేరకపోగా, ప్రభుత్వం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయల ప్రజాధనం నీళ్లపాలయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ లక్ష్యం..
సాక్షర భారత్‌లోని ఐదవ దశ కార్యక్రమం జిల్లాలోని 1207 గ్రామ పంచాయతీల్లో జనవరిలో ప్రారంభమైంది. ఒక్కో గ్రామంలో 60 మంది చొ ప్పున జిల్లావ్యాప్తంగా 72,420 మంది వయోజనలకు ఈ కార్యక్రమం కింఙద చదవడం, రాయ డం, సంఖ్య పరిజ్ఞానంపై శిక్షణ అందించాలి. అందులో భాగంగా ఒక్కో వ్యక్తికి రాసుకునేందు కు నోట్‌బుక్, పెన్సిల్, షార్ప్‌నర్‌తో కూడిన కిట్ ను ఇవ్వాల్సి ఉంది. కిట్ల సరఫరా కోసం ఫిబ్రవరిలోనే టెండర్ పిలిచారు.
ఒక్కో కిట్ ధర 27 రూపాయల 40 పైసల చొప్పున మొత్తం 19 లక్ష ల 84 వేల 308 రూపాయల వ్యయంతో 72,420 మందికి పంపిణీ చేసేందు కు వరంగల్‌కు చెందిన అంబికా ప్రింటర్స్ ముందుకు రావడంతో వారికి కేటాయించారు. ఒప్పందంలో భాగంగా మార్చి నాటికే జిల్లావ్యాప్తంగా అందరికీ కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ లక్ష్యం అనుకున్నట్లుగా నెరవేరితే జిల్లాలోని 72 వేల మందికి వయోజనులు అక్షరాస్యులవుతారు. కానీ ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.
మెటీరియల్ మాయమైందా? తక్కువ కిట్లు సరఫరా చేశారా?
ఇంతవరకు బాగానే ఉన్నా... ఏప్రిల్ వరకు జిల్లాలో ఏ ఒక్క వయోజనుడికి నోట్‌బుక్, పెన్సిల్, షార్ప్‌నర్ కిట్ అందలేదని తెలుస్తోంది. దీనిపై ఆరా తీస్తే మే మొదటి వారంలోనే సదరు కాం ట్రాక్టర్ ఆయా సామగ్రిని కరీంనగర్‌కు పంపినట్లు తెలిసింది. జిల్లా వయోజన విద్యాశాఖ అధికారులు జిల్లా పరిషత్ క్వార్టర్స్‌లో ఆయా సామగ్రిని నిల్వ చేశారు. పక్షం రోజులు గా డివిజన్ల వారీగా సామగ్రిని వాహనాల్లో తరలించి గ్రామాలకు చేర్చే పనిలో నిమగ్నమయ్యా రు.
అందులో భాగంగా కరీంనగర్ డివిజన్ పరిధిలోని మండలాలకు ఆయా వస్తువుల కిట్ల ను తీసుకెళ్లేందుకు సంబంధిత సిబ్బంది మంగళవారం జెడ్పీ క్వార్టర్‌కు వెళ్లారు. సరిపడా కిట్లు లేకపోవడంతో తిరుగుముఖం పట్టారు. ఆరా తీస్తే క్వార్టర్స్‌లో నిల్వ చేసిన కిట్లు మాయమైనట్లు తెలిసింది. తాళం ఉండగా ఎట్లా మాయం అయ్యాయనే అంశంపై చర్చ జరుగుతోంది. సద రు కాంట్రాక్టర్ సరిపడా మెటీరియల్ పంపలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అసలే నాసిరకం... ఆపై అంతా ఆలస్యం
మరోవైపు సదరు కాంట్రాక్టర్ సరఫరా చేసిన నోట్‌బుక్కులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్స్ నాసిరకమ నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటరాజ్ సంస్థకు చెందిన పెన్సిళ్లు, నోట్‌బుక్కులు పంపిణీ చేశామని చెబుతున్నా... అందులో క్వాలిటీ లేదనే విమర్శలు వస్తున్నా యి. దీనికితోడు సకాలంలో నోట్‌బుక్కులు పంపిణీ చేయకపోవడంతో ఈ కార్యక్రమం లక్ష్యమే నీరుగారి పోయినట్లయింది. మరో నెల రోజుల్లో శిక్షణ కార్యక్ర మం పూర్తి కాబోతుండగా... ఇప్పుడు నోట్‌బుక్కులు, పెన్సి ల్స్, షార్ప్‌నర్స్ ఇచ్చి ఉపయోగం ఏముందని వయోజనులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం నీళ్లపాలయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఆలస్యమైన మాట వాస్తవమే : సత్యనారాయణ, వయోజన విద్య డిప్యూటీ డెరైక్టర్
సాక్షర భారత్ ఐదో దశ మెటీరియల్ పంపిణీ కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. పదిహేను రోజుల క్రితమే పుస్తకాలొచ్చాయి. వాటిని జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీచేశాం. హుజూ రాబాద్ నియోజకవర్గంలోని మండలాలు మినహా జిల్లావ్యాప్తంగా అందరికీ మెటీరియల్ పంపిణీ చేశాం. జెడ్పీ క్వార్టర్స్‌లో నిల్వ చేసిన మెటీరియల్ మాయమైందనడంలో వాస్తవం లేదు. నాలుగైదు మండలాలకు సరిపడా మెటీరియల్ తక్కువ పడినట్లు సిబ్బంది చెబుతున్నరు.
ఏదేమైనా అన్ని మండలాలకు తగిన మెటీరియల్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌దే. అందరికీ మెటీరియల్ అందకపోతే తగిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం మెటీరియల్ అనేది సరికాదు. నటరాజ్ సంస్థ పెన్సిళ్లనే పంపిణీ చేశాం. నోట్‌బుక్స్ నాణ్యతపై అనుమానాలొస్తే ల్యాబ్‌కు పంపాం. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం.
సాక్షర భారత్‌లో గోల్‌మాల్!
Published Wed, May 27 2015 1:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement