నల్లగొండ అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ శాఖలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో ప్రధాన పోస్టులైన
నల్లగొండ అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ శాఖలో కీలకపోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో ప్రధాన పోస్టులైన డిప్యూటీ డెరైక్టర్ (ఆగ్రానమీ), డిప్యూటీ డెరైక్టర్( ప్లాంట్ ప్రొడక్షన్) పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా డీడీఏలతో పాటు ఒక ఏడీఏ (శిక్షణ)పోస్టు కూడా గత ఏడాదికాలంగా ఖాళీగా ఉంది. అధికారులు ఉద్యోగ విమరణ పొందిన నాటి నుంచి కొత్తగా అధికారుల నియామకం కాకపోవడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు పోస్టులకు ఏడీఏ(ఆగ్రానమీ)గా పనిచేస్తున్న అధికారిణి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంటాయి.
సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ, జాతీయ ఆహారభద్రత మిషన్, రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన తదితర సబ్సిడీ పథకాల ద్వారా కోట్లాది రూపాయలతో ఆయా ప్రభుత్వాలు ఆమలు చేస్తుంటాయి. జిల్లా వ్యవసాయ కార్యాలయం ద్వారా అమలయ్యే పథకాలను పై అధికారులు ఎప్పటికప్పుడ పర్యవేక్షణ చేస్తూ సకాలంలో అర్హులైన రైతులకు అందించేలా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మూడు ప్రధాన పోస్టులలో అధికారులు లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలుకు నోచుకోవడం కష్టమే మరి.
వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ పథకాల అమలును పర్యవేక్షిస్తే, కార్యాలయంలోని డీడీఏలు,ఏడీఏలు కార్యాలయంలో రైతులకు అందుబాటు లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడంతో పాటు పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇంతటి ప్రధాన పోస్టులలో అధికారులు లేకపోవడం వల్ల ఖరీఫ్‌లో రైతులకు తిప్పలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో జేడీఏ బి.నర్సింహారావుతో పాటు ఏడీఏ సుభోదిని మాత్రమే ఉండడడం వల్ల వారికి పనిభారం బాగా పెరిగింది. ఖాళీలను భర్తీ చేయకపోతే ప్రస్తుత ఖరీఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి.
‘ఆత్మ’దీ అదే దారి
జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ(ఆత్మ) కార్యాలయంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేసిన కె.హేమమహేశ్వర్‌రావు విభజనలో భా గంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడంతో పీడీ పో స్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిగా జేడీఏ బి.నర్సింహారావు వ్యవహరిస్తున్నారు. కాగా కార్యాలయంలోని రెండు డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టులు రెండేళ్లకుపైగా ఖాళీగా ఉన్నాయి. మూడు ప్రధాన పో స్టులు ఖాళీ ఉండడంతో రైతులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అందజేస్తారో అధికారులే చెప్పాలి. ఆత్మ ద్వారా పలు పథకాలను అమలు చేస్తుం టారు. రైతులకు వ్యవసాయ శాఖతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా వివిధ రకాల శిక్షణను , క్షేత్ర ప ర్యటనలు, అవగాహన సదస్సులు వీటితో పాటు నాగార్జునసాగర్ ఆధునికీకరణ పథకంలో భాగంగా పలు పథకాలను అమలు చేస్తూ రైతులకు ఆధునిక వ్యవసాయంపై పరిజ్ఞానాన్ని పెపొం దించే ఆత్మలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడం వలన రైతులకు ఇబ్బందులే మరి. వెంటనే ఆయా శాఖలలో ఖాళీపోస్టులను భర్తీ చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.