హుజూర్నగర్: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై గిరిజనులు గురువారం మధ్యాహ్నం దాడికి పాల్పడ్డారు. కేసు విషయంలో ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఓ గిరిజన వర్గం వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ మేళ్లచెర్వు మండల పరిధిలోని పీక్లా నాయక్ తండాకు చెందిన మరో వర్గం గిరిజనులు గురువారం పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
అక్కడకు చేరుకున్న ఎస్ఐ ధర్నాను విరమించుకోవాలని హెచ్చరిస్తూ ఓ గిరిజనుడిపై చేయి చేసుకోగా.. వారు తిరగబడి ఎస్ఐపై పిడిగుద్దులు కురిపించారు. గిరిజనుల నుంచి తప్పించుకుని ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి పరారయ్యారు.