నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలోని కృష్ణానది వంతెనపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. నాగార్జునాసాగర్ డ్యాం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్నా నేపధ్యంలో అద్దంకి, నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
(దామరచర్ల)
దామరచర్లలో టీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా
Published Sat, Feb 14 2015 1:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement