
ఓటర్లను మరోమారు కలవండి
⇒ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రి హరీశ్‌రావు
⇒ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం మహబూబ్ నగర్– రంగారెడ్డి– హైదరాబాద్‌లో తాము మద్దతిస్తున్న అభ్యర్ధి కాటేపల్లి జనార్దన్ రెడ్డిని గెలిపించడంపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. బ్యాలెట్ పేపర్‌లో పొరపాట్ల వల్ల ఈనెల 19వ తేదీకి ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇన్‌చార్జులుగా వ్యవహరి స్తున్న వారితో మంత్రి హరీశ్‌రావు శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, బాలరాజు, మండలి చీఫ్ విప్ పాతూరి సుధా కర్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో చర్చించారు.
ఎన్నిక వరకు మరోమారు ఉపాధ్యాయులు, అధ్యాపకులను నేరుగా కలవాలని ఇన్‌చార్జు లకు హరీశ్ సూచించారు. ప్రధానంగా ఉపా« ద్యాయ సంఘ నాయకులతో సమావేశాలు జరపాలని సూచించారు. ఇదివరకు ఏయే వర్గాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయో గుర్తించి నందున, అవి మళ్లీ తలెత్తకుండా చూసుకోవా లన్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, రెసిడెన్షియల్ స్కూళ్ల టీచర్లు, కస్తూర్బా పాఠశా లల టీచర్లు, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్లను మళ్లీ ఒకసారి కలసి అభ్యర్ధి కోసం ఓట్లు కోరాలని అన్నారు. ఈ ఎన్నికల్లో 23,400 పైచిలుకు ఓటర్లు ఉన్నందున.. సాధ్యమైనంత మంది ఓటర్లను కలిసేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.