సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల మేనిఫెస్టో అమలును వేగిరం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సామాజిక పింఛన్ల పరిమితిని పెంచుతామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా సామాజిక పింఛన్ల పరిమితిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య, వింతంతు పింఛన్లను రూ.1000కి, వికలాంగ పింఛన్లను రూ.1500కు పెంచుతూ అధికారులు రూపొందించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు సమాచారం. కానీ ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
2.66లక్షల మందికి లబ్ధి..
ప్రస్తుతం జిల్లాలో 2,66,363 మంది సామాజిక పింఛన్ల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందులో భాగంగా వికలాంగ, అభయ హస్తం కేటగిరీ లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.500 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగతా కేటగిరీలకు రూ.200 చొప్పున పంపిణీ చేస్తోంది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి నెలకు రూ.6.61 కోట్లు ఖర్చవుతోంది. తాజాగా పింఛన్ల పరిమితిని పెంచడంతో 2.66 లక్షల మందికి పెంపు ఫలితం దక్కనుంది. మంగళవారం సాయంత్రానికి సర్కారు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
భారం 21.63కోట్లు..
కొత్తగా సామాజిక పింఛన్ల పరిమితి పెంచడంతో సర్కారు ఖజానాపై ప్రస్తుత బడ్జెట్‌కు అదనంగా మూడింతల భారం పడనుంది. ప్రస్తుతం జిల్లాలోని సామాజిక పింఛన్ల లబ్ధిదారులకుగాను నెలకు రూ.6.61కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త పింఛన్ విధానంతో ప్రతి నెల లబ్ధిదారులకు రూ.28.24 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలో సర్కారు ఖజానాపై అదనంగా రూ. 21.63కోట్ల భారం పడనుంది.
ఆ‘మోదం’
Published Mon, Sep 29 2014 11:32 PM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
Advertisement