
మాట్లాడుతున్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార
బిచ్కుంద(జుక్కల్) : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలను అణగదొక్కుతుందని మహిళలు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. మంగళవారం బిచ్కుందలో మహిళ సంఘాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ స్తే రివాల్వండ్ ఫండ్ కింద ప్రతి సంఘానికి లక్ష నగదు గ్రాంట్ ఇస్తామన్నారు. గ్రామంలో సమాఖ్య సంఘం భవనాలకు రూ.15లక్షలు, మండల సమాఖ్య భవనాలకు రూ.30లక్షలతో నిర్మిస్తామన్నారు. మహిళల కోసం మేనిఫె స్టో ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ యూత్ నాయకులు మ హ్మద్ యాషిన్, దేవాడ మాజి సర్పంచ్ ఈర్‌షెట్టి, ఎమ్మర్పీ స్ నాయకులు విజయ్, మారొతి పాల్గొన్నారు.
రేపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ
పిట్లం(జుక్కల్) : బిచ్కుందలో గురువారం కాంగ్రెస్ పార్టీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తెలిపారు. ఆయన మంగళవారం పిట్లంలో విలేరులతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఆదేశాలతో పార్టీని బలోపేతానికి రిజర్వ్‌డ్ నియోజకవర్గం జుక్కల్‌లో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నామన్నారు. నిజాంసాగర్ నుంచి బిచ్కుంద వరకు బైక్ ర్యాలీ తీస్తామని, దీనిలో కార్యకర్తలు భారీగా పాల్గొనాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం, కాంగ్రెస్ పా ర్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ గంగారాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రాజు, సూరత్‌రెడ్డి, శివ,సాయిరెడ్డి, అశోక్, మొయిన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment