హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ అనుసరించాల్సని వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు.
కేంద్ర నిర్ణయం పట్ల లోక్సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని, ఈ విషయంపై ఇతర పార్టీలతో చర్చించాలని కేసీఆర్ ఎంపీలతో చెప్పారు.
కేసీఆర్తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
Published Sun, Aug 10 2014 6:34 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement