
కనగల్: సమావేశంలో మాట్లాడుతున్న చాడ కిషన్‌రెడ్డి
సాక్షి, కనగల్ : రాష్ట్రంలోని పదహారు ఎంపీ స్థానాలను గెలుచుకుని ఢిల్లీలోని పార్లమెంట్‌లో గులాబీ దండు కదలాలని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్వేశిపురం స్టేజీ సమీపంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మంత్రి పదవుల కోసం ఆనాడు తెలంగాణ ఆకాంక్షను తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ చెల్లని నోటు ఎక్కడా చెల్లదన్నారు.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణను భ్రష్టు పట్టించారన్నారు. ఎన్నికల కోసం ఎన్ని అడ్డదారులనైనా తొక్కే నైజం కాంగ్రెస్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కొప్పుల కృష్ణయ్య, నాయకులు లతీఫ్, వెంకటాచారి, వాసురావు, మల్లేశ్, మారయ్య, చంద్రయ్య, సతీశ్, అంజయ్య, నర్సింహ్మ, చంద్రారెడ్డి, లక్ష్మయ్య, గోపాల్‌రెడ్డి, మణిబాబు, యాదగిరి, శేఖర్, శ్రవణ్, సయ్యద్, సైదులు, శివ, మోహన్, చక్రి, నర్సింహ్మ, తహేర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment