సాక్షి, హైదరాబాద్: ఓ చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు వ్యవహారంలో మంగళవారం తెలంగాణ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాకు చెందిన 17నెలల చిన్నారి ఫర్నీక గౌచర్ వ్యాధితో బాధపడుతుంది. కాగా చికిత్స కోసం ఎక్కువ ఖర్చు అవుతుండడం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఫర్నీక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఫర్నీక చికిత్సకు ఏడాదికి సుమారుగా 40 లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, సదరు చిన్నారి విషయంలో పలు కీలక సూచనలు చేసింది. చిన్నారికి తక్షణమే చికిత్స అందించాల్సిందిగా నిలోఫర్ ఆస్పత్రి, తెలంగాణ మెడికల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక సూపరిడెంట్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి చికిత్స అందివ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment