
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఐపాస్ పనితీరును కొనియాడుతూ ఓ పారిశ్రామికవేత్త బుధవారం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పారిశ్రామికవర్గాల నుంచి ప్రభుత్వ విధానాల పట్ల లభించే సానుకూల ఫీడ్‌బ్యాక్ మరింత బాగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల కల్పన లక్ష్యం వైపు పని చేసేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ పనితీరును ప్రశంసిస్తూ డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారావు మంత్రికి లేఖ రాశారు.
గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి సొంత పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రయత్నించగా ఎదుర్కొన్న అనుభవాలను లేఖలో పంచుకున్నారు. 15 ఏళ్ల పాటు అనేక సంస్థల్లో ఔషధ పరిశోధన విభాగాధిపతిగా పని చేశానని, పరిశ్రమల స్థాపనకు ఇంత సులభమైన, పారదర్శకమైన పద్ధతి ఎప్పుడూ లేదని కొనియాడారు. గతంతో పోల్చితే ప్రస్తుతం డ్రగ్ లైసెన్సింగ్ విధానం అత్యంత సులువుగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment