రాష్ట్రపతికి టీఎస్పీఎస్సీ వివరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నోటిషికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీఎస్‌పీఎస్సీ బృందం తెలియజేసింది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీఎస్‌పీఎస్సీ చెర్మైన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడిన కొత్త కమిషన్ పనితీరు ఎలా కొనసాగుతోందని రాష్ట్రపతి ఈ సందర్భంగా వారిని అడిగారు.
బంగారు తెలంగాణ సాధనలో కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులదే కీలక పాత్ర అని, ఉద్యోగ నియామకాల్లో సర్వీసు కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని, రాజ్యాంగ బద్ధమైన సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి టీఎస్‌పీఎస్సీ బృందానికి సూచించారు. తాము కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నామని కొత్త రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వివరించారు.