tspsc members
-
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఆ ఆరు పరీక్షలపై దృష్టి -
నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నాం
రాష్ట్రపతికి టీఎస్పీఎస్సీ వివరణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నోటిషికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీఎస్పీఎస్సీ బృందం తెలియజేసింది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీఎస్పీఎస్సీ చెర్మైన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడిన కొత్త కమిషన్ పనితీరు ఎలా కొనసాగుతోందని రాష్ట్రపతి ఈ సందర్భంగా వారిని అడిగారు. బంగారు తెలంగాణ సాధనలో కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులదే కీలక పాత్ర అని, ఉద్యోగ నియామకాల్లో సర్వీసు కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని, రాజ్యాంగ బద్ధమైన సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి టీఎస్పీఎస్సీ బృందానికి సూచించారు. తాము కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నామని కొత్త రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వివరించారు.