సాక్షి, హైదరాబాద్: సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతం సోమవారం విడుదలైంది. సమ్మె నేపథ్యంలో 49,700 మం దికి డబ్బులు లేవనే కారణంతో జీతాన్ని జమ చేయలేదు. అలాగే సమ్మె సమయంలో అందు లో పాల్గొనని వారికి కూడా ఆ జీతాన్ని ఇవ్వలేదు. కొద్ది రోజుల కిందట సమ్మెలో లేనివారి కి మాత్రం చెల్లించారు. ఆదివారం ఉద్యోగుల తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వెం టనే అందరికీ జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తానికి మరికొంత కలిపి సోమవారం ఉద్యోగుల ఖాతాల్లోకి జీతం జమైంది.
Comments
Please login to add a commentAdd a comment